డిసెంబర్ 29న 16జి‌బి ర్యామ్ తో కొత్త స్మార్ట్ ఫోన్.. ఎక్కువ స్టోరేజితో 5జి, ఫాస్ట్ ఛార్జింగ్‌ కూడా..

ఐకూ నియో 7  రేసింగ్ ఎడిషన్ ఐకూ నియో 7కి అప్‌గ్రేడ్‌గా అందించబోతోంది. ఐకూ నియో 7 డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్.   ఐకూ నియో 7 రేసింగ్ ఎడిషన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1తో అమర్చబడుతుంది. 

iQOO Neo 7 RE will be launched on December 29 with 16GB RAM and 50MP camera

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  ఐకూ (IQOO)కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐకూ నియో 7 రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ డిసెంబర్ 29న దేశీయ మార్కెట్లోకి రానుంది. స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్, గరిష్టంగా 16జి‌బి ర్యామ్ ఫోన్‌కు లభిస్తుంది. ఐకూ నియో 7 రేసింగ్ ఎడిషన్ కి 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇచ్చారు. ఈ ఫోన్ 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్ పొందుతుంది. 

ఐకూ నియో 7  రేసింగ్ ఎడిషన్ ఐకూ నియో 7కి అప్‌గ్రేడ్‌గా అందించబోతోంది. ఐకూ నియో 7 డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్.   ఐకూ నియో 7 రేసింగ్ ఎడిషన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1తో అమర్చబడుతుంది. ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో రానుంది. 

ఐకూ నియో 7 రేసింగ్ ఎడిషన్ 8 జి‌బి, 12 జి‌బి ఇంకా 16 జి‌బి LPDDR5 ర్యామ్ వేరియంట్ ఆప్షన్ పొందుతుంది. మరోవైపు ఫోన్ స్టోరేజ్ గురించి మాట్లాడినట్లయితే,  512జి‌బి వరకు స్టోరేజ్ సపోర్ట్ ఇవ్వవచ్చు. ఫోన్ 6.78 అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లే పొందుతుంది, ఇది (1080 x 2400 పిక్సెల్‌లు) రిజల్యూషన్ ఇంకా 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం ఇన్-డిస్ ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

 కెమెరా ఇంకా బ్యాటరీ
 ఐకూ  నుండి రాబోయే ఫోన్  కెమెరా సెటప్ గురించి మాట్లాడితే 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. ఫోన్‌తో సెల్ఫీ ఇంకా వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios