క్వాల్ కం ఫాస్టెస్ట్ ప్రాసెసర్ బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్.. బ్యాంక్ కార్డ్స్ పై భారీ డిస్కౌంట్..
ఫోన్‌తో క్వాల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 512జిబి వరకు స్టోరేజ్ సపోర్ట్ LPDDR5X ర్యామ్ తో 16 జిబి వరకు ఆప్షన్ ఉంది. ఫోన్ అండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్‌తో వస్తుంది.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ ఇండియాలో అత్యంత వేగవంతమైన, ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐకూ 11 5జిని లాంచ్ చేసింది. ఐకూ 11 5జి స్మార్ట్‌ఫోన్‌లో 144Hz డిస్‌ప్లే, క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ అందించారు. 6.78 అంగుళాల 2కె ఈ6 ఆమోలెడ్ డిస్ ప్లే, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఫోన్‌లో చూడవచ్చు. ఫోన్‌లో 512జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం...
ఐకూ 11 5జి హై లెట్స్
ప్రాసెసర్- క్వల్ కం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 & 16జిబి+512జిబి
డిస్ ప్లే -6.78 అంగుళాలు (17.22 సెం.మీ.)
బ్యాక్ కెమెరా- 50ఎంపి + 13ఎంపి + 8ఎంపి
సెల్ఫీ కెమెరా - 16ఎంపి
బ్యాటరీ - 5000mAh, 120W ఛార్జింగ్
ధర
ఐకూ 11 5G ధర 8జిబి + 256జిబి వేరియంట్‌కు రూ. 59,999, 16జిబి + 256జిబి వేరియంట్‌కు రూ. 64,999. అలాగే, ఫోన్‌తో కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ పై రూ. 5,000 అదనపు డిస్కౌంట్ ఇవ్వబోతోంది, ఐకూ 11 5G 8జిబి + 256జిబి ధర రూ. 54,999, 16జిబి + 256జిబి ధర రూ.59,999. ప్రైమ్ యూజర్లు జనవరి 12 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ప్రీ యాక్సెస్‌ను పొందినప్పటికీ, ఫోన్‌ను జనవరి 13 నుండి అమెజాన్ ఇండియా, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కొనవచ్చు.
స్పెసిఫికేషన్లు
6.78-అంగుళాల ఈ6 ఆమోలెడ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఐకూ 11 5Gతో వస్తుంది. ఇంకా 144Hz రిఫ్రెష్ రేట్, 2K రిజల్యూషన్ ఉంది. డిస్ ప్లే LTPO 4.0, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్‌డిఆర్10+, 1.07 బిలియన్ కలర్స్, DCI-P3 కలర్ గమట్, 1800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్, 1440Hz PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఫోన్‌తో క్వాల్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 512జిబి వరకు స్టోరేజ్ సపోర్ట్ LPDDR5X ర్యామ్ తో 16 జిబి వరకు ఆప్షన్ ఉంది. ఫోన్ అండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్‌తో వస్తుంది. దీనితో కంపెనీ మూడేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందించబోతోంది.
కెమెరా
ఐకూ 11 5జీలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో f/1.88 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ స్యామ్సంగ్ GN5 సెన్సార్ ఉంది. ప్రైమరీ కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ ఉంది. అంతేకాకుండా, ఫోన్ f/2.2 ఎపర్చరుతో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెకండరీ సెన్సార్, మూడవది f/2.46 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ 2xపోర్ట్రెయిట్-టెలిఫోటో సెన్సార్‌కు సపోర్ట్ చేనిస్తుంది. సెల్ఫీలు ఇంకా వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16ఎంపి కెమెరా ఉంది. వివో కొత్త V2 కస్టమ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ISP) కెమెరాతో సపోర్ట్ చేయబడింది.
బ్యాటరీ
ఐకూ 11 5జిలో 5,000 mAh బ్యాటరీ ఉంది, ఇంకా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు. ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5G, డ్యూయల్ 4G VoLTE,వై-ఫై 6, బ్లూటూత్ 5.3, GPS/ GLONASS, USB టైప్-C అండ్ NFC ఉన్నాయి.