ఐఫోన్ 14 ప్రో VS ప్రో మాక్స్ 14 ప్రో మాక్స్: రెండు ఐఫోన్‌ల మధ్య తేడా ఏంటి, స్పెసిఫికేషన్స్ ఇవే..

ఈసారి ఐఫోన్ మినీని పరిచయం చేయలేదు, అయితే ఐఫోన్ 14 ప్రో అండ్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ హై-ఎండ్ ఫోన్‌ల కింద ప్రవేశపెట్టరు. ఈ రెండు ఫోన్‌లు డైనమిక్ ఐలాండ్ అంటే పిల్ షేప్ హోల్ పంచ్ కటౌట్‌తో తీసుకొచ్చారు.

iPhone 14 Pro VS iPhone 14 Pro Max: Whats difference between these two Phones

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఆపిల్  'ఫార్ అవుట్' ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ సిరీస్ కింద ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో అండ్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ అనే నాలుగు కొత్త ఐఫోన్‌లను  ఆవిష్కరించారు. అయితే ఈసారి ఐఫోన్ మినీని పరిచయం చేయలేదు, అయితే ఐఫోన్ 14 ప్రో అండ్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ హై-ఎండ్ ఫోన్‌ల కింద ప్రవేశపెట్టరు. ఈ రెండు ఫోన్‌లు డైనమిక్ ఐలాండ్ అంటే పిల్ షేప్ హోల్ పంచ్ కటౌట్‌తో తీసుకొచ్చారు. 2017 తర్వాత ఐఫోన్ నాచ్‌లో మార్పు రావడం ఇదే తొలిసారి. రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు దాదాపు ఒకేలా ఉన్నాయి, అయితే ఫోన్‌లలో కూడా చాలా తేడాలు ఉన్నాయి.  ఐఫోన్ 14 ప్రొ,   ఐఫోన్ 14  ప్రొ మ్యాక్స్  ఫీచర్లు, తేడాల గురించి తెలుసుకుందాం...

ఐఫోన్ 14 ప్రో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్: డిస్‌ప్లే 
ఐఫోన్  14 ప్రో మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 2556x1179 పిక్సెల్‌ రిజల్యూషన్ అండ్ 460 ppiతో వస్తుంది. ఐఫోన్ 14 ప్రో మాక్స్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 2796x1290 పిక్సెల్‌లు రిజల్యూషన్ అండ్ 460 ppiతో వస్తుంది. రెండు ఫోన్‌ల నాచ్‌లో మార్పులు చేసారు. ఈ ఫోన్‌లు ఇప్పుడు పిల్ షేప్ (టాబ్లెట్) హోల్ పంచ్ కటౌట్ డిజైన్‌ పొందాయి, దీనికి ఆపిల్ డైనమిక్ ఐలాండ్ అని పేరు పెట్టింది. ఈ నాచ్ గురించి చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే, నోటిఫికేషన్ ప్రకారం ఇది పెద్దగా లేదా చిన్నగా కావచ్చు. ఈ నాచ్‌లో ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. రెండు ఫోన్‌ల డిస్‌ప్లే ప్రో-మోషన్ టెక్నాలజీతో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌  ఉంది. రెండు ఫోన్‌ల డిస్‌ప్లేతో HDR సపోర్ట్ అందించారు. ట్రూ-టోన్‌తో డిస్‌ప్లే, వైడ్ కలర్ (P3), హాప్టిక్ టచ్, 20,00,000:1 కాంట్రాస్ట్ రేషియో, ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ ఒలియోఫోబిక్ కోటింగ్, అల్ వేస్ ఆన్ డిస్‌ప్లేలో ఉంటుంది.
 
డిజైన్ అండ్ బరువు
ఐఫోన్ 14 ప్రో కాంపాక్ట్ డిజైన్‌తో పరిచయం చేసారు, ఐఫోన్ 14 ప్రో మాక్స్ పెద్ద డిస్‌ప్లే ఇంకా అధిక బరువుతో వస్తుంది. అయితే, రెండు ఫోన్‌ల మందం 7.85 ఎం‌.ఎం. రెండు ఫోన్‌లు సర్జికల్ గ్రేడ్ మెటల్‌తో తయారు చేసారు. బరువు విషయానికొస్తే ఐఫోన్ 14 ప్రో బరువు 206 గ్రాములు, ఐఫోన్ 14 ప్రో మాక్స్ కొంచెం ఎక్కువగా 240 గ్రాముల బరువు ఉంటుంది. రెండు ఫోన్‌లు సిరామిక్ షీల్డ్ ఫ్రంట్, టెక్చర్ మేట్ గ్లాస్ బ్లాక్ అండ్ స్టెయిన్‌లెస్ స్టీల్ డిజైన్‌ ఇచ్చారు.
 
 ప్రాసెసర్ అండ్ స్టోరేజ్ 
ఐఫోన్  ఈ రెండు మోడల్‌లలో కొత్త చిప్‌సెట్ A16 బయోనిక్‌ అందించారు, 6 కోర్ CPUతో వస్తుంది. ప్రాసెసర్‌తో పాటు 5 కోర్ గ్రాఫిక్స్‌కు సపోర్ట్ కూడా ఉంది. ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ తో గరిష్టంగా 128జి‌బి, 256 జి‌బి, 512జి‌బి, 1టి‌బి స్టోరేజ్ లభిస్తుంది.

ఐఫోన్ 14 ప్రో VS ఐఫోన్ 14 ప్రో మాక్స్: ధర 
ఆపిల్ కి చెందిన ఈ రెండు ఐఫోన్ ల ధరలో పెద్దగా తేడా లేదు. ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ. 1,29,900 కాగా, ఐఫోన్ 14 ప్రో మాక్స్ ప్రారంభ ధర రూ. 1,39,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ల  కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడినట్లయితే స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, డీప్ పర్పుల్ కలర్స్ ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios