Asianet News TeluguAsianet News Telugu

మొదటి 5జి ఫోన్ గురించి సమాచారం లీక్.. వారికోసం ప్రత్యేకంగా ఈ స్పెసిఫికేషన్లతో లాంచ్..

 జియో  ఫోన్ 5జి  కెమెరా సెటప్ గురించి మాట్లాడినట్లయితే, ఈ ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్‌ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా చూడవచ్చు. 

Information about Jio's first 5G phone came to the fore this cheap phone will be equipped with these specifications
Author
First Published Dec 9, 2022, 5:22 PM IST

రిలయన్స్ జియో  45వ ఆన్యువల్ జనరల్ మీటింగ్ నుండి జియో ఫోన్ 5జి గురించి చర్చలు జరుగుతున్నాయి. అన్నింటిలో మొదటిది, ఈ సమావేశంలో కంపెనీ జియో  5జి సేవలను ప్రారంభించడంతోపాటు జియో  ఫోన్ 5జి లాంచ్ గురించి  ప్రకటించింది. కంపెనీ త్వరలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది, అయితే లాంచ్‌కు ముందే ఫోన్‌కు సంబంధించిన సమాచారం తెరపైకి వచ్చింది. కంపెనీ నుండి రాబోయే 5G ఫోన్ వివరాలు లాంచ్ ముందే వెల్లడయ్యాయాయి.

 జియో  ఫోన్ 5జి  స్పెసిఫికేషన్లు  అండ్ ఫీచర్లు
జియో  ఫోన్ 5g వివరాల సమాచారం Geekbench వెబ్‌సైట్‌లో లీక్ చేయబడింది. లీక్ ప్రకారం, జియో ఫోన్ 5G త్వరలో ఇండియాలో ప్రారంభించబడుతుంది. ఆయితే ఈ ఫోన్‌ను 10 వేల నుండి 12 వేల ధరతో విడుదల చేయవచ్చు. జియో ఫోన్ 5G స్పెసిఫికేషన్ గురించిన సమాచారం కూడా వెల్లడైంది.

లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ 6.5 అంగుళాల HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లేతో 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.  ఫోన్ లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసింగ్ పవర్ అండ్ 4జి‌బి ర్యామ్ తో 32జి‌బి స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్ పని చేస్తుంది. 

కెమెరా అండ్ బ్యాటరీ
మరోవైపు, Jio ఫోన్ 5G కెమెరా సెటప్ గురించి మాట్లాడినట్లయితే, ఈ ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్‌ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా చూడవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, రీడ్ ఎలౌడ్ టెక్స్ట్ అండ్ గూగుల్ లెన్స్ వంటి ఫీచర్లు ఫోన్‌తో సపోర్ట్ చేస్తాయి.

ఫోన్‌లో సెక్యూరిటి కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. Jio ఫోన్ 5G బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీ అందించారు, దీనితో 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ అందిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios