ఒకటి కాదు, రెండు కాదు.. ఈ స్మార్ట్ ఫోన్ కి నాలుగు కెమేరాలు

Huawei Nova 3 with 6.3-inch display and 4 cameras to launch on July 18
Highlights

ఈ ఫోన్ లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు కెమేరాలు ఏర్పాటు చేశారు. ఇదే ఈ ఫోన్ అసలు ప్రత్యేకత.
 

ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ హువావే నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. హువావే నోవా 3 పేరిట ఈ  స్మార్ట్ ఫోన్ ని ఈనెల 18వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. చైనాలో జరగనున్న ఓ ఈవెంట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ ఫోన్ ధర వెల్లడించలేదు. కానీ ఇప్పటివరకు లీకైన ఫీచర్లు, తదితర సమాచారాన్ని బట్టి.. రూ.30 వేల వరకు ఉండవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోన్ లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు కెమేరాలు ఏర్పాటు చేశారు. ఇదే ఈ ఫోన్ అసలు ప్రత్యేకత.

హువావే నోవా 3 ఫీచర్లు... 
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3650 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

loader