Asianet News TeluguAsianet News Telugu

డిజైన్ నుండి కలర్ వరకు అమెజింగ్ ఫోన్‌.. 12జి‌బి ర్యామ్ తో హానర్ కొత్త ఎడిషన్ లాంచ్..

హానర్ 80 ప్రో స్ట్రెయిట్ స్క్రీన్ ఎడిషన్ ధర 3,599 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 43,300. ఫోన్ సింగిల్ వేరియంట్ 12 జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్‌ లో లభిస్తుంది.

Honor launched a great phone, from design to colors are amazing
Author
First Published Jan 9, 2023, 11:50 AM IST

స్మార్ట్  ఫోన్ బ్రాండ్ హానర్ ఇండియన్ మార్కెట్లోకి హానర్ 80 ప్రో స్ట్రెయిట్ స్క్రీన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్లు హానర్ 80 సిరీస్  హానర్ 80 ప్రొ ఫోన్‌ లాగా ఉంటాయి. హానర్ 80 ప్రో స్ట్రెయిట్ స్క్రీన్ ఎడిషన్ మూడు కలర్స్ లో ప్రవేశపెట్టారు. కొత్త ఫోన్‌లో 6.67-అంగుళాల ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లే ఉంది. అంతేకాకుండా, హానర్ 80 ప్రో స్ట్రెయిట్ స్క్రీన్ ఎడిషన్‌కు 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో అందిస్తున్నారు. ఈ ఫోన్ కి 66W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4800mAh బ్యాటరీ లభిస్తుంది.

హానర్ 80 ప్రో స్ట్రెయిట్ స్క్రీన్ ఎడిషన్ ధర
హానర్ 80 ప్రో స్ట్రెయిట్ స్క్రీన్ ఎడిషన్ ధర 3,599 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 43,300. ఫోన్ సింగిల్ వేరియంట్ 12 జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్‌ లో లభిస్తుంది. హానర్ ఈ ఫోన్ బ్రైట్ బ్లాక్, ఇంక్ జెడ్  గ్రీన్, మార్నింగ్ గ్లో కలర్‌లో కొనవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేస్తారా లేదా అనే సమాచారం లేదు.

స్పెసిఫికేషన్‌లు
హానర్ 80 ప్రో స్ట్రెయిట్ స్క్రీన్ ఎడిషన్ డ్యూయల్ సిమ్‌తో ఆండ్రాయిడ్ 12 ఆధారిత మ్యాజిక్ OS 7.0 ఉంది. అంతేకాకుండా 1080x2400 పిక్సెల్‌ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లే బ్రైట్ నెస్ 1000 నిట్స్. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో గ్రాఫిక్స్ కోసం ఆండ్రినో 730 GPU, 12జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్ ఉంది.

కెమెరా
హానర్ 80 ప్రో స్ట్రెయిట్ స్క్రీన్ ఎడిషన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీని ప్రైమరీ  లెన్స్ 160 మెగాపిక్సెల్‌ ఎపర్చరు f/1.8, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇంకా మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, సెల్ఫీ కోసం 32-మెగాపిక్సెల్ AI కెమెరా  ఉంది.

 బ్యాటరీ
కనెక్టివిటీ కోసం, హానర్ 80ప్రొ స్ట్రెయిట్ స్క్రీన్ ఎడిషన్‌లో 5జి, బ్లూటూత్ v5.2, Wi-Fi 802.11a/b/g/n/ac/ax, ఎన్‌ఎఫ్‌సి, యూ‌ఎస్‌బి ఓ‌టి‌జి, జి‌పి‌ఎస్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఇంకా ఫేస్ అన్‌లాక్ కూడా ఉంది. ఫోన్ 66W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4800mAh బ్యాటరీ ఉంది. ఫోన్ మొత్తం బరువు 193 గ్రాములు.

Follow Us:
Download App:
  • android
  • ios