గూగుల్ తేజ్ ఇప్పుడు.. గూగుల్ పేగా మారింది

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 28, Aug 2018, 3:46 PM IST
Google Tez is now Google Pay, to offer instant bank loans
Highlights

ఆన్‌లైన్‌ పేమెంట్లకు వీలుగా ఆన్‌లైన్‌, ఇన్‌ స్టోర్‌ ఆప్షన్స్‌ను కొత్తగా గూగుల్‌ తీసుకొస్తోంది. దీంతో పాటు ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌కు యాప్‌ ద్వారా అప్లై చేసుకునే సదుపాయం తీసుకొస్తోంది. 

గూగుల్ తేజ్ యాప్ గురించి తెలియని వాళ్లు ఉండరేమో. సులభంగా డబ్బులు పంపించడానికి ఈ తేజ్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాప్ ని ఉపయోగించి డబ్బు పంపినా.. లేదా ఎవరైనా మనకు పంపినా.. రివార్డ్స్ పేరిట అదనంగా డబ్బులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అసలు మ్యాటర్ లోకి వెళ్దాం..

ఇప్పుడు ఈ యాప్‌ పేరు మారింది! ఇకపై తేజ్‌ కాస్తా.. ‘గూగుల్‌ పే’గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు దిల్లీలో జరిగిన ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా 2018’ కార్యక్రమంలో గూగుల్‌ ప్రకటించింది. మరికొన్ని కొత్త సర్వీసులను కూడా ఇందులో ప్రవేశపెట్టింది.

సులువుగా యూపీఐ పేమెంట్స్‌ చేసుకునేందుకు వీలున్న ‘తేజ్‌’ పేరు మార్చినప్పటికీ యాప్‌లో ఎలాంటి మార్పులూ ఉండవని గూగుల్‌ పేర్కొంది. పేరు మాత్రమే ‘గూగుల్‌ పే’గా మారుతోంది. ఎప్పటిలానే హోం స్క్రీన్‌, బిల్‌ పేమెంట్స్‌, కాంటాక్ట్స్‌ వంటివి ఉంటాయి. వీటితో పాటు మరిన్ని ఆన్‌లైన్‌ పేమెంట్లకు వీలుగా ఆన్‌లైన్‌, ఇన్‌ స్టోర్‌ ఆప్షన్స్‌ను కొత్తగా గూగుల్‌ తీసుకొస్తోంది.

దీంతో పాటు ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌కు యాప్‌ ద్వారా అప్లై చేసుకునే సదుపాయం తీసుకొస్తోంది. ఈ మేరకు ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి బ్యాంకులతో ఒప్పందం చేసుకోనుంది. తదుపరి అప్‌డేట్‌లో పేరుతో పాటు మరికొన్ని ఫీచర్లు యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.

loader