Asianet News TeluguAsianet News Telugu

డిజిటల్ చెల్లింపుల్లో ‘గూగుల్-పే’ ఫస్ట్.. ఇండియన్లే ముందంజ

అంతర్జాతీయంగా డిజిటల్ చెల్లింపులన్నీ అత్యధికంగా ‘గూగుల్ పే’ ద్వారా జరుగుతాయని తేలింది. 
 

Google Pay looks beyond UPI, card payments in the works
Author
Hyderabad, First Published May 13, 2019, 1:11 PM IST

న్యూఢిల్లీ: మన ఇంటిపక్కనే ఉన్న కిరాణా స్టోర్ గురించి చాలామందికి తెలియదు కానీ, గూగుల్ ప్లే స్టోర్ గురించి భారతదేశంలో తెలియని వారు మాత్రం ఉండరు. కావాల్సిన యాప్‌ను చిటికెలో అందించే గూగుల్ ప్లేస్టోర్‌ను రోజుకోసారి అయినా దర్శించుకోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 

గూగుల్ పే తర్వాతే యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఇండియన్ చెల్లింపు దారులంతా తమ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల నుంచి గూగుల్ పే ద్వారా చెల్లించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఇప్పుడు ఇందుకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ డౌన్‌లోడ్లలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడైంది. ఆ తర్వాతీ స్థానంలో బ్రెజిల్ నిలవగా, అమెరికా మూడో స్థానం ఉంది. 

గూగుల్ పే డౌన్ లోడ్ చేసుకుంటున్న తర్వాతీ స్థానాల్లో వరుసగా రష్యా, మెక్సికో, టర్కీ, వియత్నాం, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా ఉన్నాయి. 
భారతదేశంలో అత్యధికంగా డౌన్‌లోడ్ అవుతున్న గేమ్స్‌లలో లుడో కింగ్ అగ్రస్థానంలో ఉంది.

సబ్‌వే సర్ఫర్స్, టెంపుల్ రన్ 2, క్యాండీ క్రష్ సాగా, టెంపుల్ రన్ ఆ తర్వాతీ స్థానాల్లో ఉన్నాయి. ఫుడ్ యాప్స్‌ డౌన్‌లోడ్లలో డొమినోస్ పిజ్జా అగ్రస్థానంలో ఉండగా, మెక్‌డెలివరీ ఇండియా వెస్ట్ అండ్ సౌత్, పిజ్జా హట్ ఇండియా, స్టార్‌బక్స్ ఇండియా, కేఎఫ్‌సీ ఇండియా ఆ తర్వాతీ స్థానాల్లో ఉన్నాయి.

గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ అవినాశ్ మిదుథూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గూగుల్ పే’ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరుగడమే కాదు యాప్ ద్వారా చెల్లింపుల ప్రక్రియ పెరుగుదలకు దారి తీస్తోందన్నారు. గూగుల్ పే ద్వారా ‘రెడ్ బస్’ నుంచి బస్ రిజర్వేషన్ల కోసం 15 శాతానికి పైగా చెల్లింపులు జరిగాయి.

ఉబేర్ యూజర్లు 50 శాతానికి పైగా ‘గూగుల్ పే’ ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. యూపీఐతో పోలిస్తే గూగుల్ పే వైవిధ్య భరింగా ఓమ్నీ చానెల్ ద్వారా చెల్లింపులు జరుపుతోంది. 

భారతదేశంలో నెలవారీగా గూగుల్ పే చెల్లింపులు 4.5 కోట్లు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల విలువ 81 బిలియన్ల డాలర్లు అని తేలింది. దేశమంతటా 2000కి పైగా మర్చంట్ పార్టనర్స్‌ను గూగుల్ పే కలిగి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios