Asianet News TeluguAsianet News Telugu

గూగుల్ కొత్త ఫీచర్... విద్యర్ధుల కోసం ప్రత్యేకంగా...

 గూగుల్ ఇప్పుడు ఒక కొత్త ఆలోచన చేసింది. లాక్‌డౌన్‌ వల్ల పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. ఉద్యోగులు వ‌ర్క‌ ఫ్ర‌మ్‌ హోమ్ చేస్తున్నారు. స్కూల్స్ తెరుచుకునే అవకాశాలు లేని కారణంగా పిల్ల‌లు  ఏం చేసేది లేక  ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటున్నారు

google intfroduces  youtube learing for  students in summer
Author
Hyderabad, First Published Apr 20, 2020, 4:28 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి భారత దేశాన్ని వణికిస్తుంది. రోజుకు రోజుకు అన్నీ రాష్టాల్లో కేసులు పెరుతుండటంతో లాక్ డౌన్ మళ్ళీ మే 7 వరకు పొడిగించారు. అత్యవసర సౌకర్యాల మినహా మిగతా అన్నిటి పై ఆంక్షలు విధించారు.

ముఖ్యంగా విద్యా సంస్థలపై,విద్యార్ధులపై ప్రభావం చూపిస్తుంది. ఇందుకోసం గూగుల్ ఇప్పుడు ఒక కొత్త ఆలోచన చేసింది. లాక్‌డౌన్‌ వల్ల పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు.

ఉద్యోగులు వ‌ర్క‌ ఫ్ర‌మ్‌ హోమ్ చేస్తున్నారు. స్కూల్స్ తెరుచుకునే అవకాశాలు లేని కారణంగా పిల్ల‌లు  ఏం చేసేది లేక  ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటున్నారు. మరికొందరు ఇళ్లలోనే చిన్న చిన్న ఆటలు ఆడుకుంటున్నారు.

ఇది ఇలానే కొనసాగితే వారు నేర్చుకున్నవి కూడా మ‌రిచిపోతారు. అందుకే గూగుల్ ఈ-లెర్నింగ్ అనే స‌రికొత్త విభాగాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇది విద్యార్థుల‌కే కాకుండా బోధ‌నా సిబ్బందికీ అనుకూల‌మైన ఫీచ‌ర్‌.

ఇప్ప‌టివ‌ర‌కు ఇంగ్లీష్‌, హిందీలో మాత్ర‌మే అందుబాటులో ఉండే ఈ విభాగంలో సైన్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్ట్స్‌తోపాటు యోగా, ఫొటోగ్ర‌ఫీపై పాఠాలుంటాయ‌ని యూట్యూబ్ తెలిపింది.

భాష‌తో ఇబ్బంది ప‌డుకుండా ఉండేందుకు తెలుగు, త‌మిళం, మ‌రాఠీ, బెంగాలి వంటి పలు ప్రాంతీయ భాష‌ల్లోనూ పాఠాల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు గూగుల్ సంస్థ పేర్కొన్న‌ది. మొబైల్‌ లేదా కంప్యూట‌ర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యంతో పాఠాలు విన‌వ‌చ్చు. 

aklso read 

దీనికి  'గూగుల్ మీట్' సదుపాయం కూడా ఉన్న‌ది. దీని ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా 250 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకేసారి వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన‌వ‌చ్చు.

వీడియో కాన్ఫ‌రెన్స్ స‌దుపాయాన్ని ఉప‌యోగించి 250 మంది ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ అందించింది. ఈ యాప్‌కు  'బోలో' అని పేరు పెట్టింది. దీని వల్ల పిల్ల‌లు త‌మ‌కు తాముగా  పాటలు నేర్చుకోవ‌చ్చు. అ

యితే ఈ యాప్‌ను ఈ ఏడాది చివ‌ర‌లో అందుబాటులోకి తేవాల‌ని భావించారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌తో పిల్ల‌లంద‌రూ ఇంట్లోనే ఉండ‌డంతో వారికి ఈ సమయం వృధా కాకుండా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని ఇప్పుడు తీసుకువ‌చ్చారు. గూగుల్ ప్లేస్టోర్‌లో నుండి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీని బీటా వర్షన్‌ అందుబాటులో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios