నిలిచిపోనున్న గూగుల్ క్రోమ్.. మీరు ల్యాప్‌టాప్ ఉపయోగిస్తుంటే వెంటనే ఈ పని చేయండి..

విండోస్  7, విండోస్  8/8.1 లో క్రోమ్ సపోర్ట్ ముగించబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది, క్రోమ్ 109 లాస్ట్ వెర్షన్ అప్ డేట్. టెక్ దిగ్గజం గూగుల్  నెక్స్ట్ అప్‌డేట్ క్రోమ్ 110ని 7 ఫిబ్రవరి 2023న లాంచ్ చేయబోతోంది. 

Google Chrome will be closed! If you use laptop then do this work today itself

మీరు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఇంటర్నెట్‌ కోసం గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నారా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్. నిజానికి, మైక్రోసాఫ్ట్  విండోస్  ల్యాప్‌టాప్‌లు లేదా పాత వెర్షన్‌లతో ఉన్న డెస్క్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ సపోర్ట్ ఆపివేయబోతోంది. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ సర్వర్ 2012 అండ్ విండోస్ సర్వర్ 2012 అన్ని వెర్షన్‌లకు సపోర్ట్ ఎండ్ చేస్తున్నట్లు  ప్రకటించింది. 10 జనవరి 2023 నుండి WebView2 టూల్‌కు సపోర్ట్ నిలిపివేస్తున్నట్లు గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. అంటే, క్రోమ్ 109 చివరి అప్‌డేట్ వెర్షన్ అవుతుంది. 

ఫిబ్రవరి 7న కొత్త క్రోమ్ వెర్షన్ 
విండోస్  7, విండోస్  8/8.1 లో క్రోమ్ సపోర్ట్ ముగించబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది, క్రోమ్ 109 లాస్ట్ వెర్షన్ అప్ డేట్. టెక్ దిగ్గజం గూగుల్  నెక్స్ట్ అప్‌డేట్ క్రోమ్ 110ని 7 ఫిబ్రవరి 2023న లాంచ్ చేయబోతోంది. అయితే, ఈ అప్‌డేట్ విండోస్ 10 లేదా తర్వాతి వెర్షన్‌ ఉన్న డివైజెస్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో క్రోమ్ అప్ డేట్ రిలీజెస్ పొందాలనుకుంటే మీరు మీ డివైజ్ లో విండోస్ 10 లేదా తర్వాతి వెర్షన్‌లో రన్ అవుతుండాలి అని గూగుల్ తెలిపింది.

గూగుల్ క్రోమ్ 109 చివరి వెర్షన్, ఈ వెర్షన్ విండోస్ 7, విండోస్ 8/8.1కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే, ఇప్పుడు కొత్త క్రోమ్ వెర్షన్ 110 విండోస్ 7, గూగుల్ 8/8.1లో ఉపయోగించలేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, గూగుల్ క్రోమ్ 109ని విండోస్ 7, విండోస్ 8/8.1 లలో ఉపయోగించవచ్చు, కానీ కంపెనీ దాని కోసం ఎటువంటి అప్ డేట్ విడుదల చేయదు. అంటే, మీరు పాత విండోస్ సిస్టమ్‌ని ఉపయోగిస్తే మీరు గూగుల్ క్రోమ్ 109ని ఉపయోగించగలరు. అయితే సెక్యూరిటీ పరంగా లేటెస్ట్ వెర్షన్ ల్యాప్ టాప్ వాడటం లేదా కొత్త విండోస్ కు అప్ డేట్ చేసుకోవడం మంచిది.  

మీరు విండోస్ 10ని ఉపయోగిస్తుంటే, మీరు విండోస్ 11కి అప్‌డేట్ చేసుకోవచ్చు. విండోస్ 11 తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి సులభమైన మార్గం తెలుసుకొండి...
అన్నింటిలో మొదటిది, మీరు మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో విండోస్ అప్‌డేట్ సెట్టింగ్‌లను ఓపెన్ చేయాలి.
అప్‌డేట్ సెట్టింగ్‌లలో ఇప్పుడు అప్‌డేట్ & సెక్యూరిటీ ఆప్షన్ కు వెళ్లి, ఇక్కడ విండోస్ అప్‌డేట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఇక్కడ అప్ డేట్స్ కోసం చెక్ అప్ డేట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
మీ డివైజ్ Windows 11 కోసం సిద్ధంగా ఉంటే, ఇక్కడ మీరు డౌన్‌లోడ్ ఆప్షన్ పొందుతారు. 
డౌన్‌లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆపై విండోస్ 11 ఇన్‌స్టాల్ చేయండి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios