Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్: ఇప్పుడు కేవలం తక్కువ ధరకే ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్.. ఎలా ఉంటుందంటే..?

అమెజాన్ ప్రైమ్ లైట్ అమెజాన్ ప్రైమ్ కంటే ఎక్కువ ఉండదు కానీ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీని ధర రూ. 999 ఇంకా మీరు ఒక సంవత్సరం పాటు మెంబర్‌షిప్ పొందుతారు. 

Good news: Now Amazon Prime membership for one year in just Rs 999
Author
First Published Jan 16, 2023, 4:01 PM IST

అధిక ధర కారణంగా మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందలేకపోతున్నారా.. అయితే మీకో శుభవార్త. ఇప్పుడు మీరు కేవలం రూ.999కే అమెజాన్ ప్రైమ్ ని ఆస్వాదించవచ్చు. నిజానికి అమెజాన్ బీటా వెర్షన్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్‌ని పరీక్షిస్తోంది. ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ అవుతుంది. డిసెంబర్ 2021లో, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధరను రూ.999 నుండి రూ.1,499కి పెంచిన సంగతి మీకు తెలిసిందే. ఈ ధర అన్నువాల్ మెంబర్‌షిప్ కోసం.

అమెజాన్ ప్రైమ్ లైట్‌లో ఏం ఉంటుంది?
అమెజాన్ ప్రైమ్ లైట్ అమెజాన్ ప్రైమ్ కంటే ఎక్కువ ఉండదు కానీ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీని ధర రూ. 999 ఇంకా మీరు ఒక సంవత్సరం పాటు మెంబర్‌షిప్ పొందుతారు. ఈ ప్లాన్ బీటా టెస్టింగ్‌ని మొదట ఒక వెబ్ సైట్ నివేదించింది. ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రస్తుతం బీటా వినియోగదారులకు రూ.999కి అందుబాటులో ఉంది.

అమెజాన్ ప్రైమ్ వన్-డే లేదా ఆర్డర్-డే డెలివరీని అందిస్తే, అమెజాన్ ప్రైమ్ లైట్‌ రెండు రోజుల డెలివరీని అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లైట్‌కి అమెజాన్ ప్రైమ్ వీడియోలను చూసే ఆన్ లిమిటెడ్ అవకాశం కూడా లభిస్తుంది, అయితే ఇందులో ప్రకటనలు కనిపిస్తాయి ఇంకా వీడియో క్వాలిటీ HDగా ఉంటుంది. Amazon Prime Lite మెంబర్‌షిప్‌ని రెండు డివైజెస్ లో ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌కు యాక్సెస్ అమెజాన్ ప్రైమ్ లైట్‌లో ఉండదు. ఇది కాకుండా, నో-కాస్ట్ EMI, ఫ్రీ-ఇబుక్స్, ప్రైమ్ గేమింగ్ సౌకర్యం కూడా  ఉండదు.

అమెజాన్ ప్లాన్‌లు
డిసెంబర్ 2021లో అమెజాన్ ప్లాన్‌ ధరను 50 శాతం పెంచింది, దీంతో రూ. 999 ఆన్యువల్ ప్లాన్ ధర రూ. 1,499కి చేరింది. కంపెనీకి ప్రతి నెల ప్లాన్‌లు కూడా ఉన్నాయి, అలాగే వీటి ధరలు కూడా పెరిగాయి. రూ.129 ప్లాన్ ఇప్పుడు రూ.179గా పెరగగా, మూడు నెలల రూ.329 ప్లాన్ ధర ఇప్పుడు రూ.459గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios