TRAI order:మంత్లి ప్లాన్‌ల కోసం చూస్తున్న కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్స్.. అతితక్కువ ధరకు మాత్రమే

రూ. 296 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు, రూ. 319 ప్లాన్ వాలిడిటీ  కూడా ఒక నెల మొత్తం ఉంటుంది, అంటే మీరు ఏ తేదీన రీఛార్జ్ చేసుకుంటారో, అదే తేదీని వచ్చే నెలలోనే రీఛార్జ్ చేసుకోవాలి.
 

Follow TRAIs order Airtel launches two new prepaid plans for one month validity starting price Rs 296

కొద్ది రోజుల క్రితం ట్రాయ్ (TRAI) ఆర్డర్ తర్వాత టెలికాం దిగ్గజం రిలయన్స్  జియో (Jio) ఒక నెల వాలిడిటీతో కొత్త ప్రీపెయిడ్  ప్లాన్‌ను ప్రారంభించింది. దీంతో జియో తర్వాత ఎయిర్‌టెల్ కూడా ఒక నెల వాలిడిటీతో రెండు కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఒక నెల వాలిడిటీతో వస్తున్న రెండు కొత్త ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధరలు రూ.296 మరొకటి రూ.319. వీటిలో రూ. 296 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు అలాగే రూ. 319 ప్లాన్ వ్యాలిడిటీ మొత్తం నెలకు ఉంటుంది, అంటే మీరు రీఛార్జ్ చేసిన తేదీ నుండి వచ్చే నెల అదే తేదీన రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని నెలల క్రితం, TRAI అన్ని టెలికాం కంపెనీలను ఒక నెల వాలిడిటీతో ప్లాన్‌లను ప్రారంభించాలని ఆదేశించింది.

ఎయిర్‌టెల్ రూ. 296 ప్లాన్
ఎయిర్‌టెల్ ఈ రెండు కొత్త ప్లాన్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. రూ. 296 ప్లాన్‌లో కస్టమర్‌లు 30 రోజుల వాలిడిటీ పొందుతారు. అంతేకాకుండా, ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో, ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్‌ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌తో మొత్తం 25జి‌బి  డేటా లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్
ఎయిర్‌టెల్ రూ. 296 ప్లాన్‌తో కస్టమర్‌లు 30 రోజులు కాకుండా మొత్తం నెల వాలిడిటీని పొందుతారు, అంటే, మీరు ఏప్రిల్ 1న రీఛార్జ్ చేసుకున్నట్లయితే, మీ ప్లాన్ మే 1న ముగుస్తుంది, అంటే నెల 30 రోజులు లేదా 31 రోజులకు. ఇది కాకుండా ఈ ప్లాన్‌లోని అన్ని నెట్‌వర్క్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా ఉంటాయి. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. Airtel ఈ రెండు ప్లాన్‌లతో  Amazon Prime వీడియో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఒక నెల పాటు పొందవచ్చు.

జియో ఒక నెల ప్లాన్
Jio ఇటీవల రూ. 259 ప్లాన్‌ను ప్రారంభించింది. దీనితో మీరు ఒక నెల పూర్తి వాలిడిటీ పొందుతారు, అంటే మీరు ఏప్రిల్ 1వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే, మీరు నెక్స్ట్ రీఛార్జ్‌ను మే 1వ తేదీన మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్‌లు ప్రతిరోజూ 1.5జి‌బి డేటాను పొందుతారు. అంతేకాకుండా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్  చేసుకోవచ్చు.

మీరు ఈ ప్లాన్‌ని ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి నెల వాలిడిటీ గడువు ముగిసిన తర్వాత కొత్త ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌లో కూడా ఇతర ప్లాన్‌ల లాగానే Jio అన్ని యాప్‌లు సబ్‌స్క్రైబ్ పొందవచ్చు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios