సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’ కీలక నిర్ణయం తీసుకున్నది. మెసేజింగ్ యాప్స్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఐడెంటీకి చెల్లుచీటీ ఇచ్చేసింది. వాటిని తానే నిర్వహిస్తానని ఫేస్ బుక్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మారనున్నాయి. వీటి ప్రధాన సంస్థ ఫేస్‌బుక్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్ నుంచి వచ్చినా వీటికంటూ స్వతంత్రత ఉంది. గత ఏడాదిగా ఫేస్‌బుక్ వీటికి ఆ స్వతంత్రతను తగ్గిస్తోంది.
ఇప్పుడు ఏకంగా వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ పేర్లు మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ 2012లో ప్రారంభించగా, వాట్సప్ 2014లో వినియోగంలోకి వచ్చింది. ఈ రెండింటికీ సొంత మేనేజర్లు, ఉద్యోగులు, విడివిడి కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఫేస్‌బుక్ తమ సంస్థలో కొన్ని కొత్త సంస్కరణలు తెచ్చింది. వాటిలో భాగంగా వీటికి స్వతంత్రతను తగ్గించాలని చూస్తోంది.
ఇందులో భాగంగానే వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ పేర్లలో కాస్త మార్పులు చేయనున్నట్లు ఈ వారం ప్రకటించింది. ఇకపై వాట్సప్ పేరును ‘వాట్సప్ ఫ్రమ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను ‘ఇన్‌స్టాగ్రామ్ ఫ్రమ్ ఫేస్‌బుక్’ అని మార్చనుంది. ఇక గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఈ పేర్లతోనే ఈ రెండు యాప్‌లు కనిపిస్తాయి. లాగిన్ పేజీల్లోనూ ఇదే పేరు కనపడనుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సప్‌ను మూడింటినీ ఇక మాతృక సంస్థ ‘ఫేస్ బుక్’ నిర్వహిస్తుంది.
గత ఐదేళ్లకాలంలో వాట్సప్, ఇన్‌స్టాలలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. వినియోగదారులకు సౌలభ్యం కోసం, వారిని ఆకర్షించేందుకు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, ఫేస్‌బుక్ స్టోరీస్, వాట్సప్ స్టేటస్ వంటి ఫీచర్లు ఈ కోవలోకి చెందినవే.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 5, 2019, 3:22 PM IST