ఫేస్‌బుక్ వాడుతున్నారా.. ఇప్పుడు దీని ద్వారా వారి వయస్సు ఈజీగా తెలుస్తుంది...
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లు యూజర్ ని కంపెనీ గుర్తిస్తే ఫేస్‌బుక్ డేటింగ్‌లో వారి వయస్సును వేరిఫై చేయమని యూజర్లను ప్రాంప్ట్ చేస్తుందని Meta బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ సర్వీసెస్ మెరుగుపర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ స్కానర్‌లతో ప్రయోగాలు చేస్తోంది. AI ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ సహాయంతో ఫేస్‌బుక్ డేటింగ్ సర్వీస్‌లోని యూజర్ల వయస్సును కంపెనీ గుర్తిస్తుందని Meta ప్రకటించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లు Facebook డేటింగ్ సర్వీస్ నుండి దూరంగా ఉంచడానికి కంపెనీ ఈ చర్య తీసుకుంది.
వయస్సు ఇలా వెరిఫై చేయవచ్చు
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లు యూజర్ ని కంపెనీ గుర్తిస్తే ఫేస్‌బుక్ డేటింగ్‌లో వారి వయస్సును వేరిఫై చేయమని యూజర్లను ప్రాంప్ట్ చేస్తుందని Meta బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. Facebookలో వయస్సును వేరిఫై చేయడానికి మీరు సెల్ఫీ సహాయం తీసుకోవచ్చు. అంటే ముందుగా ఫేస్‌బుక్‌లో ఏజ్ వెరిఫైడ్ ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ మీ సెల్ఫీ వీడియోను షేర్ చేసుకోవాలి.ఇప్పుడు Facebook ఏజ్ వెరిఫికేషన్ కృత్రిమ మేధస్సు ఫేస్ స్కానర్ సహాయంతో ధృవీకరిస్తుంది.
పిల్లలను నిరోధించడంలో
పెద్దల కోసం అందిస్తున్న ఫీచర్‌లను పిల్లలు యాక్సెస్ చేయకుండా నిరోధించడంలో న్యూ ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ సహాయపడుతుందని మెటా తెలిపింది. అయితే ఫేస్‌బుక్ డేటింగ్‌లో పెద్దలకు చాలా అరుదుగా ఏజ్ వెరిఫికేషన్ ఉంటుంది. అమెరికన్ సోషల్ మీడియా కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లను చెక్ చేయడంతో సహా ఏజ్ వెరిఫికేషన్ బెనెఫిట్స్ కోసం యోటిని ఉపయోగించింది. చాలా మంది యూజర్లు అసలు వయస్సు తెలపకుండా 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండేలా వారి పుట్టిన తేదీని మార్చేస్తుంటారు.
మహిళలకు టెక్నాలజీ
నివేదికల ప్రకారం, ఈ సిస్టమ్ అందరికీ అక్యురేట్ గా పనిచేయట్లేదు. Yoti డేటా మహిళల ముఖాలు, ముదురు రంగులతో ఉన్న వారి వయస్సు అక్యురేట్ గా కాకుండా తక్కువగా చూపిస్తుంది.

