Asianet News TeluguAsianet News Telugu

50 ఏళ్ల హిస్టారికల్ రీసెర్చ్‌కు ‘ఫేస్‌బుక్‌’ ఒక బేస్

మన నిత్య జీవితంతో పెనవేసుకున్న సోషల్ మీడియా వేదిక ‘ఫేస్ బుక్’ 50 ఏళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనానికి పునాదిగా మారనున్నది. ఈ శతాబ్ది ముగిసే నాటికి యూజర్ల కంటే మరణించి వారి సంఖ్యే ఎక్కువవుతుందని ఆక్స్ ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 

Dead to outnumber the living on Facebook in 50 years
Author
Hyderabad, First Published Apr 29, 2019, 11:16 AM IST

సోషల్ మీడియా వేదికల్లో ఫేస్‌బుక్‌ ఒక సంచలనం. ఎంతో మంది స్నేహితులను, బంధువులను దగ్గర చేయడమే కాదు, వారి అనుభవాలను, అనుభూతులను పంచుకునేందుకు చక్కని వేదికగా రూపుదిద్దుకున్నది. గతంతో పోలిస్తే మాత్రం ఇటీవల ఫేస్‌బుక్‌ వినియోగించే వారి సంఖ్య(యాక్టివ్‌ యూజర్లు‌) కాస్త తగ్గిందనే చెప్పాలి. ఆ స్థానాన్సి వాట్సాప్‌ ఆక్రమించేస్తోంది. 

వచ్చే 50 ఏళ్లల్లో ఫేస్‌బుక్‌ వినియోగిస్తున్నవారిలో ఎక్కువ మంది చనిపోయి ఉంటారని ఫేస్‌బుక్‌పై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అనుబంధ ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్ (ఓఐటీ) శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధన తెలిపింది. 2018నాటి ఫేస్‌బుక్‌ యూజర్ల ఆధారంగా ఈ పరిశోధన సాగింది. 2100 కంటే ముందే  140 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్లు చనిపోతారని తెలిపింది. 2070 నాటికే ఫేస్‌బుక్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య కంటే, మృతి చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

‘ఫేస్‌బుక్‌ తన సేవలను ఇలాగే విస్తరించుకుంటూ వెళ్తే, మరో 50 సంవత్సరాలకు దానిని వినియోగిస్తున్న వారి కంటే చనిపోయిన యూజర్ల సంఖ్యే ఎక్కువ. ఈ శతాబ్ది చివరికల్లా అలా చనిపోయిన వారి సంఖ్య మొత్తం 490 కోట్లకు చేరవచ్చు’ అని ఆక్స్ ఫర్డ్ శాస్తవేత్తల పరిశోధనా నివేదిక పేర్కొన్నది. 

‘ఫేస్‌బుక్‌లో ఉన్న డేటాపై ఎవరికి హక్కు ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. చనిపోయిన వారి ఖాతాలను వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కొనసాగించొచ్చు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు భవిష్యత్‌ చరిత్రకారులు సైతం ఫేస్‌బుక్‌ డేటాను వినియోగించుకోవచ్చు’ అని ‘ఓఐటీ’ డాక్టరోరల్ మెంబర్ కార్ల్‌ ఒహోమన్‌ అభిప్రాయపడ్డారు. 

నిత్యం ప్రతిఒక్కరూ ఇప్పుడు వినియోగించే సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్‌లో 2018లో నూతన సభ్యులెవరూ చేరలేదు. ఆసియాలో ఈ శతాబ్ది చివరికల్ల మరణించే వారి శాతం 44 శాతం ఉంటుందని అంచనా. వారిలో సగం మంది భారత్, ఇండోనేషియాలకు చెందిన వారే. అంతర్జాతీయంగా ప్రస్తుతానిక కంటే 13 శాతం ఫేస్ బుక్ రేటింగ్ 13 శాతం పెరుగుతోంది. ఆఫ్రికా ఖండంలో మరణించే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios