ఇప్పుడు మీకు ఇష్టమైన రేడియో స్టేషన్‌ని క్రియేట్ చేయండి.. కొత్త అప్‌డేట్‌తో యూట్యూబ్ మ్యూజిక్..
ఇప్పుడు యూట్యూబ్ స్వయంగా రేడియో స్టేషన్‌ను తయారు చేస్తోంది. యూజర్ పాటను సెలెక్ట్ చేసుకొని వినడం ప్రారంభించిన వెంటనే అతని కోసం రేడియో స్టేషన్ రూపొందించబడుతుంది.
యూట్యూబ్ మ్యూజిక్ కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. యాప్‌లో క్రియేట్ వీడియో అనే కొత్త ఫీచర్ ని అందించింది. అయితే ఈ ఫీచర్ కొత్త అప్‌డేట్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక ఫీచర్ ఏంటంటే, ఈ అప్‌డేట్‌ను ఉపయోగించి యూజర్లు సొంత రేడియో స్టేషన్‌లను క్రియేట్ చేయవచ్చు.
ఇప్పుడు యూట్యూబ్ స్వయంగా రేడియో స్టేషన్‌ను తయారు చేస్తోంది. యూజర్ పాటను సెలెక్ట్ చేసుకొని వినడం ప్రారంభించిన వెంటనే అతని కోసం రేడియో స్టేషన్ రూపొందించబడుతుంది. ఇంకా 'అప్ నెక్స్ట్' సెక్షన్‌లో తర్వాత ఏ పాట వస్తుందో కూడా చూడవచ్చు. ఈ స్టేషన్‌ని రెగ్యులర్ ప్లేలిస్ట్ లో సేవ్ చేయడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
కొత్త అప్‌డేట్‌తో, యూజర్లు క్రియేట్ ఎ రేడియో ఫీచర్‌ని ఉపయోగించి తమకు ఇష్టమైన పాటలతో రేడియో స్టేషన్‌ను క్రియేట్ చేయవచ్చు. ఇప్పటి నుండి మీరు YouTube Music యాప్ కింద క్రియేట్ రేడియో కార్డ్‌ని చూస్తారు. ఈ లేబుల్‌ని యువర్ మ్యూజిక్ ట్యూనర్ అంటారు. ఒక రేడియో స్టేషన్‌లో దాదాపు 30 పాటలు ఉండవచ్చు.
అలాగే ఇందులోని పాటలను కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలను రేడియోలో వినమని కూడా మీరు సూచించవచ్చు. మీరు రేడియో స్టేషన్‌ని సృష్టించిన తర్వాత, ఇచ్చిన ప్రమాణాల ప్రకారం రేడియోలో కొత్త పాటలు ప్లే చేయబడతాయి.
కొన్నిసార్లు యాప్‌లు పాటలు లేవని కూడా చెప్పవచ్చు. అలాంటప్పుడు నిరాశ చెందకండి. అందించిన ఫిల్టర్‌లను అడ్జస్ట్ చేయాలని తెలుసుకోండి. Spotify అండ్ Apple Musicలో ఇప్పటికే ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది.