లుక్ మాత్రమే కాదు డిస్ ప్లే, ప్రాసెసర్లో కూడా మార్పులు; ఐఫోన్ 16పై వస్తున్న పుకార్లు ఇవే..
ఎప్పటిలాగే ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లోని మోడల్‌లు iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro అండ్ iPhone 16 Pro Max. ఐఫోన్ 16 గురించిన చాలా సమాచారం ఇప్పటికే లీక్ అయింది.
ఆపిల్ ఐఫోన్ ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో కనిపిస్తుంది. ఆపిల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఒక స్టేటస్ గా కూడా మారాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లోని మోడల్‌లు iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro అండ్ iPhone 16 Pro Max. ఐఫోన్ 16 గురించిన చాలా సమాచారం ఇప్పటికే లీక్ అయింది. ఇదిలా ఉంటే, ఆపిల్ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్ల స్పెసిఫికేషన్‌లను పెద్దగా వెల్లడించలేదు. కానీ ఐఫోన్ 16 సిరీస్ గురించి ఇప్పటికే హల్ చల్ చేస్తున్న టాప్ నాలుగు పుకార్లను చూద్దాం...
1. A17 బయోనిక్ చిప్
ఇప్పటికే ఆకట్టుకుంటున్న A16కి నుండి Apple iPhone 16 సిరీస్‌లో A17 బయోనిక్ చిప్‌ను పరిచయం చేస్తుందని నమ్ముతారు. ఈ చిప్ ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్, హై గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్, మెరుగైన శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది.
2. పెద్ద డిస్ ప్లే
ఐఫోన్ 16 ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లు పాత మోడళ్ల కంటే పెద్ద డిస్‌ప్లేతో ఉంటాయని మరో రూమర్ వినిపిస్తుంది. పెద్ద డిస్‌ప్లే మంచి వ్యూ అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
3. లాంగ్ బ్యాటరీ లైఫ్
Apple iPhoneలు ఎల్లప్పుడూ వాటి బ్యాటరీ లైఫ్ కి ప్రసిద్ధి చెందాయి. ఐఫోన్ 16 సిరీస్‌లో కొత్త టెక్నాలజీ అమర్చి ఉంటుందని అంచనా చేస్తున్నారు, ఈ ఫీచర్ ఫోన్ ప్రస్తుత వాటి కంటే ఎక్కువ ఛార్జింగ్ లైఫ్ అందించడానికి సహాయపడుతుంది.
4. మరిన్ని కలర్స్
మరో ప్రధాన చర్చ ఏమిటంటే, ఐఫోన్ 16 మరిన్ని కొత్త కలర్స్ లో వస్తుందనే పుకారు ఉంది. ఐఫోన్ 16 బ్లాక్, గ్రీన్, గులాబీ, నీలం ఇంకా వైట్ కలర్స్ వస్తుందని సూచనలు ఉన్నాయి.