Buying a New Ac: ఈ సమ్మర్ కి ఏసీ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!
మే నెల మొదలైంది. వేసవి మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే ఎండలు విపరీతంగా ఉండగా.. మరింత పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా నానాటికీ అధికవుతున్నాయి. ఇలాంటి తరుణంలో చాలా మంది ఉపశమనం కోసం ఎయర్ కండీషనర్లను (Air Conditioners) ఎంచుకుంటున్నారు. ఏసీలను (ACs) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఎండకి తట్టుకోలేక ఏసీని కొనాలనుకుంటున్నారా..? అయితే తప్పకుండా మీరు వీటిని తెలుసుకోవాలి.
మే నెల మొదలైంది. వేసవి మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే ఎండలు విపరీతంగా ఉండగా.. మరింత పెరిగే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా నానాటికీ అధికవుతున్నాయి. ఇలాంటి తరుణంలో చాలా మంది ఉపశమనం కోసం ఎయర్ కండీషనర్లను (Air Conditioners) ఎంచుకుంటున్నారు. ఏసీలను (ACs) కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎయిర్ కండీషనర్ ((Air Conditioner) కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని విధాల సూటయ్యే ఏసీని తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు పొందుతారు.
AC కెపాసిటీ
ఎయిర్ కండీషనర్ కొనేందుకు ముందు దాని కెపాసిటీ.. మీరు ఏసీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న గది విస్తీర్ణాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. సరైన దాన్ని తీసుకుంటేనే కూలింగ్ మెరుగ్గా ఉండడంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది. సాధారణంగా 100 నుంచి 120 చదరపు అడుగుల విస్తీరం ఉండే గదికి 1 టన్ కెపాసిటీ ఉండే ఏసీ సరిపోతుంది. ఒకవేళ దాదాపు 175 చదరపు అడుగుల వరకు ఉంటే 1.5 టన్ సామర్థ్యం ఉండేది తీసుకోవాలి. అంతకన్నా గది పెద్దగా ఉంటే 2 టన్ కెపాసిటీ ఉండే ఏసీని తీసుకోవచ్చు.
విద్యుత్ ఆదా
దాదాపు అన్ని ఎయిర్ కండీషనర్లు 1 నుంచి 5 స్టార్ రేటింగ్ వరకు ఉంటాయి. స్టార్ రేటింగ్ ఎక్కువగా ఉన్న ఏసీలు విద్యుత్‌ను తక్కువగా వాడుకుంటాయి. అంటే 3 స్టార్ రేటింగ్ కంటే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు తక్కువ పవర్‌ను వినియోగించుకుంటాయి. అందుకే ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని తీసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది. అందుకే వీలైనంత మేర 5 స్టార్ రేటింగ్ ఉన్న వాటినే ఎంచుకోవాలి. మరోవైపు సాధారణ ఏసీలతో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీల వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. అయితే ఇన్వర్టర్ ఏసీల ధర, మెయింటెనెన్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యమైన భాగాలు
ఏసీ తయారీ కంపెనీ ACలో ఏ కాయిల్స్ పొందుపరిచిందో కూడా తెలుసుకోవాలి. అల్యూమినియం కాయిల్స్‌తో పోలిస్తే కాపర్ కాయిల్స్ ఉన్న ఏసీ మెరుగ్గా పని చేస్తుంది. త్వరగా కూల్ చేస్తుంది. అయితే ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే గరిష్ఠంగా ఎంత తీవ్రమైన ఉష్ణోగ్రత వరకు ఏసీ కూల్ చేయగలదు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. బ్లోయర్ ఫ్యాన్ పెద్దగా ఉంటే ఎయిర్ ఫ్లో మెరుగ్గా ఉంటుంది. అలాగే ఫైర్ సెఫ్టీ కోసం ప్రొటెక్టివ్ కెపాసిటర్స్ కూడా చాలా ముఖ్యం. దీని గురించి కూడా ఏసీ కొనే ముందు మీ డీలర్‌ను అడగాలి. ముఖ్యంగా ఎయర్ క్వాలిటీ అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
ఏ టైప్ కావాలో..!
ఏసీల్లో ప్రధానంగా స్ల్పిట్ ఏసీ (Split AC), విండో ఏసీ (Window AC) రకాలు ఉంటాయి. స్ప్లిట్ ఏసీ రెండు యూనిట్లుగా ఉంటుంది. ఇండోర్ యూనిట్, ఔట్‌డోర్ యూనిట్ ఉంటాయి. విండో ఏసీ ఒకే యూనిట్‌గా కిటీకీలో బింగించేలా ఉంటుంది. విండో ఏసీతో పోలిస్తే స్ల్పిట్.. మెరుగైన ఎయిర్ డిస్ట్రిబ్యూషన్, వేగవంతమైన కూలింగ్ ఇస్తుంది. శబ్దం తక్కువగా ఉంటుంది. గదికి అందాన్ని ఇస్తుంది. విండో ఏసీ.. ఒకే దగ్గరే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. గదిలో ఒకచోటి నుంచి మరోచోటికి మార్చాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాగా రెండు రకాల్లో చాలా డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.
సర్వీస్ గురించి తెలుసుకోండి
ఏసీని ఎంపిక చేసుకునే ముందు ఆ కంపెనీ.. సర్వీస్ ఎలా అందిస్తుందో తప్పకుండా తెలుసుకోవాలి. ఆ కంపెనీకి మంచి సర్వీసింగ్ రికార్డ్ ఉందో లేదో ఆరా తీయాలి. ముఖ్యంగా మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయో లేదో సమాచారం తెలుకోవాలి. ఒకవేళ ఏదైనా సందేహాలు ఉంటే డీలర్‌ను కానీ, ఆ కంపెనీ సర్వీస్ సెంటర్‌కు గానీ కాల్ చేసి వివరాలు అడగాలి. ఏసీ కొన్న తర్వాత సర్వీస్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఒకవేళ ఏసీలో ఏవైనా విడిభాగాలు చెడిపోతే.. రిపేర్‌కు, విడిభాగాలకు ఎంత ఖరీదు అవుతుందనే అంశాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ మీకు అందుబాటులో సర్వీస్ లేకుంటే వేరే కంపెనీని ఆప్షన్‌గా పరిగణించవచ్చు.