BSNL: 1.12 లక్షల టవర్లు నిర్మించనున్న బీఎస్ఎన్ఎల్.. ఎందుకంటే..?

దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్ఎన్ఎల్ 1.12 లక్షల టవర్లు ఏర్పాటు చేయనుంది. ఈ విష‌యాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.
 

BSNL to install 1.12 lakh towers

ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 1.12 లక్షల టవర్లను 4జి నెట్‌వర్క్‌లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఉన్న ఈ టవర్ల ప్రక్రియ పూర్తి కానుందని బుధవారం మంత్రి లోక్ సభకు  తెలిపారు. 4జి కోసం 6000 టవర్లకు ఆర్డర్‌ ఇస్తున్నామన్నారు. మొదటి దశలో 6వేల టవర్లు .. ఆ తర్వాత లక్ష టవర్లను ఆధునీకరించనున్నామన్నారు.

దేశీయ 4జీ టెలికాం నెట్‌వర్క్‌ను త్వరలో భారతదేశం అంతటా విస్తరించనున్నట్లు , ఈ దిశగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్‌ఎల్  దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో తెలిపారు. 4జీ టెక్నాలజీతో రైళ్లలో ఇంటర్నెట్ సేవలు సాధ్యం కావని, రైళ్లలో 100 కి.మీ. పైబడి వేగం ఉన్నందున 5జీ టెక్నాలజీతోనే అది సాధ్యం అని మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ‘4జీ టెలికాం నెట్‌వర్క్ త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీనిని భారతీయ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఇక్కడే అభివృద్ధి చేశారని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మా 4జీ నెట్‌వర్క్ అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇది పూర్తి టెలికాం పరికరాలతో కూడిన కోర్ నెట్‌వర్క్‌ను, రేడియో నెట్‌వర్క్‌ను కలిగి ఉంది’ అని ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరించారు.

 4జీ నెట్‌వర్క్ కోసం బీఎస్ఎన్ఎల్ తక్షణమే 6,000 టవర్లను ఆర్డర్ చేసే ప్రక్రియలో ఉందని, ఆపై మరో 6,000.. చివరగా మరో  లక్ష టవర్లను దేశవ్యాప్తంగా ఇన్‌స్టాల్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 5జీ టెక్నాలజీ అభివృద్ధి సమాంతరంగా జరుగుతోందని, మరికొద్ది నెలల్లో సిద్ధమవుతుందని చెప్పారు. రైళ్లలో 4జీ ఇంటర్నెట్ సేవల లభ్యత గురించి అడిగినప్పుడు ‘ఒక రైలు 100 కిమీ కంటే ఎక్కువ వేగంతో నడుస్తుంటే 5జీ నెట్‌వర్క్ అవసరం అవుతుంది..’ అని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios