షాక్:ఫేస్‌బుక్‌పై రూ.46 కోట్ల జరిమానా విధించనున్న బ్రిటన్!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడే ఆస్కారం కనిపిస్తోంది. డేటా బ్రీచ్ (వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయటం) విషయంలో ఫేస్‌బుక్‌పై బ్రిటన్ సర్కారు కన్నెర్ర చేస్తోంది.

Britain Will Fine Facebook Over Cambridge Analytica Data Breaches

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడే ఆస్కారం కనిపిస్తోంది. డేటా బ్రీచ్ (వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయటం) విషయంలో ఫేస్‌బుక్‌పై బ్రిటన్ సర్కారు కన్నెర్ర చేస్తోంది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా స్కామ్ విషయంలో ఫేస్‌బుక్‌పై 5,00,000 పౌండ్ల జరిమానా (దాదాపు రూ.46 కోట్లు) విధించాలని బ్రిటన్‌కు చెందిన సమాచార పరిరక్షణ సంస్థ 'ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్' (ఐసీఓ) యోచిస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ ఇదే గనుక జరిగితే, ఫేస్‌బుక్ ఇప్పటి వరకూ చెల్లించిన జరిమానాల్లో కెల్లా ఇదే అతిపెద్ద జరిమానాగా నమోదయ్యే అవకాశం ఉంది. కేంబ్రిడ్జ్ ఎనాలిటికా మాతృ సంస్థ ఎస్‌సీఎల్ ఎలెక్షన్స్ (ఇప్పుడు మూతపడింది)పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఐసీఓ నియంత్రణ సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో కొనసాగుతున్న బ్రెగ్జిట్ వ్యవహారంలో 'ఓట్ లీవ్' (యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేలా ఓటు వేయాలనే) ప్రచారంతో కలిసి పనిచేసిన 'అగ్రిగేట్ ఐక్యూ' అనే సంస్థ, బ్రిటన్ పౌరుల సమాచారాన్ని విశ్లేషించటాన్ని నిలిపివేయాలని కూడా ఐసీఓ స్పష్టంచేసింది.

బ్రెగ్జిట్ రిఫరెండం ప్రచారం సందర్భంగా ఫేస్‌బుక్ ద్వారా రాజకీయ ప్రచారాలు, పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకోవటంపై దర్యాప్తు ప్రారంభించిన 16 నెలల తర్వాత ఐసీఓ ఈ చర్యలను ప్రకటించింది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ ఎనాలిటికా లక్షలాది మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్ వారి అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సేకరించిందని, ఆ సమాచారాన్ని ఆ సంస్థ చెరిపివేసేలా చూడటంలో ఫేస్‌బుక్ విఫలమైందని ఐసీఓ ఆరోపించింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios