బౌల్ట్ ఆడియో సరికొత్త ఇయర్‌బడ్స్.. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 100 నిమిషాల ప్లేబ్యాక్..
ఎయిర్‌బేస్ ఎన్‌కోర్ ఎక్స్ ధర రూ. 1,799గా ఉంది. దీనిని ఏప్రిల్ 8 నుండి అమెజాన్ తో పాటు కంపెనీ వెబ్‌సైట్ నుండి విక్రయించనున్నారు. ఇంకా ఒక సంవత్సరం వారంటీతో కూడా వస్తుంది.
హై ఎండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బౌల్ట్ ఆడియో (boult audio) ఇయర్‌బడ్స్ బౌల్ట్ ఎయిర్‌బేస్ ఎన్‌కోర్ ఎక్స్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎన్‌కోర్ ఎక్స్ ప్రో ప్లస్ కాలింగ్‌తో పాటు ఎన్వీరన్మ్నెటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో క్వాడ్ మైక్ సెటప్ ఉంది. బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎన్‌కోర్ ఎక్స్ ని ఛార్జింగ్ చేయడానికి యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఇచ్చారు.
బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎన్‌కోర్ ఎక్స్ బ్యాటరీ 30 గంటల బ్యాకప్ ఇస్తుందని క్లెయిమ్ చేయబడింది. ఎన్‌కోర్ ఎక్స్‌లో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1 ఇచ్చారు. బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎన్‌కోర్ ఎక్స్ బ్యాటరీకి సంబంధించి, కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌లో 100 నిమిషాల ప్లేబ్యాక్ ఉంటుందని పేర్కొంది. ఎయిర్‌బాస్ ఎన్‌కోర్ ఎక్స్ ధర రూ. 1,799గా ఉంది. ఏప్రిల్ 8 నుండి అమెజాన్ తో పాటు కంపెనీ వెబ్‌సైట్ నుండి విక్రయించనుంది.
బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎన్‌కోర్ ఎక్స్ వాటర్ రిసిస్టంట్ కోసం IPX5గా రేట్ పొందింది. ఈ ఇయర్‌బడ్స్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు దీన్ని మోనోపాడ్ అండ్ స్టీరియో మోడ్‌లో ఉపయోగించవచ్చు. అలాగే సిలికాన్ ఇయర్‌టిప్‌తో అందించారు. దీని బాడీ ప్రీమియం ప్లాస్టిక్‌తో ఉంటుంది. ఇయర్‌బడ్స్ కంట్రోల్ కోసం టచ్ సపోర్ట్ ఉంది. టచ్ కంట్రోల్ వాల్యూమ్‌ను అడ్జస్ట్ చేయడానికి, మ్యూజిక్ ట్రాక్‌లను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇంకా ఒక సంవత్సరం వారంటీతో కూడా వస్తుంది.
ఈ సంవత్సరం జనవరిలో బౌల్ట్ ఆడియో ప్రోబాస్ జెడ్ చేర్జ్ (ZCharge)ని ప్రారంభించిన సంగతి మీకు తెల్సిందే. Boult Audio ProBass ZChargeతో కంపెనీ గొప్ప బేస్ మాత్రమే కాకుండా గొప్ప బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని క్లెయిమ్ చేసింది. Boult Audio ProBass ZCharge బ్యాటరీ 40 గంటల బ్యాకప్ కోసం క్లెయిమ్ చేయబడింది. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పొందుతుంది.