తైవాన్‌కు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ ఆసుస్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు.. చైనా మొబైల్ కంపెనీలను దెబ్బ కొట్టేందుకు మరో ఎత్తుగడ వేసింది. బడ్జెట్ ధరలో జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1ను విడుదల చేసిన ఆసుస్..  తాజాగా ఫ్లాగ్‌షిప్ విభాగంలో ఆసుస్ జెన్‌ఫోన్‌ 5జెడ్‌ను తీసుకొచ్చింది. ఇండియన్ మొబైల్ మార్కెట్‌‌లో ఫ్లాగ్‌షిప్ విభాగంలో తమ హవాను చూపిస్తోన్న వన్‌ప్లస్ 6, హానర్ 10లకు ధీటుగా దీన్ని దింపినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు..

ఇది మూడు వేరియంట్లలో భారత్‌లో లభిస్తుంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న మొబైల్‌ ధర రూ.29,999, 6జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ మెమొరీ కలిగిన ఫోన్‌ రూ.32,999, 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ ధరను రూ.36,999గా నిర్ణయించారు.. ఈ నెల 9 నుంచి ఈ ఫోన్ ఆన్‌లైన్‌తో పాటు ఎంపిక చేసిన స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

జెన్‌ఫోన్ 5జెడ్ ఫీచర్లు:
* 6.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్ ఓరియో  8.0
* క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
* 12+8 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
*  8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ సపోర్ట్
* క్విక్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్
* 3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం


ఆఫర్లు:
* ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ఉన్న వారికి రూ..3,000 తగ్గింపు
* రూ.  2,999 విలువ కలిగిన కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ రూ.499లకే
* ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సులభ ఈఎంఐ రూ.3,333లకే
* జియో ఆఫర్ కింది రూ.2,200 క్యాష్ బ్యాక్, 100 జీబీ డేటా
* ఫోన్‌కు ఏదైనా సమస్య వస్తే.. కంపెనీ అధికారిక సర్వీస్ సెంటర్ ప్రతినిధి స్వయంగా వచ్చి ఫోన్ తీసుకెళ్లి.. రిపేర్ అనంతరం తిరిగి స్వయంగా తీసుకొచ్చి అందిస్తాడు..