విండోస్ ల్యాప్‌టాప్ వాడుతున్నారా..? ప్రభుత్వం హెచ్చరిక జారీ.. ఏంటంటే ?
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఒక హెచ్చరిక జారీ చేసింది.ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ కొన్ని వెర్షన్స్ లో భద్రతా లోపాలు ఉన్నాయంటు ఏజెన్సీ పేర్కొంది.
మీరు విండోస్ ల్యాప్ టాప్ వాడుతున్నారా..? అయితే అలెర్ట్ గా ఉండండి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ కొన్ని వెర్షన్స్ లో భద్రతా లోపాలను ఏజెన్సీ పేర్కొంటూ మాల్వేర్, వైరస్ మొదలైన వాటి నుండి Windowsను కాపాడే టూల్ విండోస్ డిఫెండర్ ప్రభావితం చేయవచ్చని తెలిపింది.
ఇది సెక్యూరిటి రిస్ట్రిక్షన్స్ దాటి హ్యాకర్లు ఏదైనా కంప్యూటర్‌కు యాక్సెస్‌ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఏజెన్సీ ప్రకారం, Windows డిఫెండర్ క్రెడెన్షియల్ గార్డ్ కాంపోనెంట్‌లో లోపం కారణంగా ఈ వల్నరబిలిటీ ఉంది.
CERT-In ప్రకారం, ఈ వెర్షన్స్ ప్రభావితం కానున్నయి:
·ARM64 బెసేడ్ సిస్టమ్స్ Windows 11, x64 బెసేడ్ సిస్టమ్స్ Windows 11, x64 బెసేడ్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 1607, 32-బిట్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 1607, x64 బెసేడ్ సిస్టమ్స్ Windows 10, 32 బిట్ సిస్టమ్స్ Windows 10.
·x64 బెసేడ్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 21H2, ARM64 బిట్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 21H2, 32- బిట్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 21H2, ARM64 బెసేడ్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 20H2, ARM64- బెసేడ్ సిస్టమ్స్ Windows 20H2 వెర్షన్, Windows 20H2 వెర్షన్ , x64 బెసేడ్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 20H2, 32-బిట్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 21H1.
·ARM64 బెసేడ్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 21H1, x64 బెసేడ్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 21H1, ARM64 బెసేడ్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 1809, x64 బెసేడ్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 1809, 32-బిట్ సిస్టమ్స్ Windows 10 వెర్షన్ 1809, విండోస్ సర్వర్ 2022 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్), విండోస్ సర్వర్ 2022
·విండోస్ సర్వర్ 2019 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్), విండోస్ సర్వర్ 2019, విండోస్ సర్వర్ 2016 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్), విండోస్ సర్వర్ 2016, విండోస్ సర్వర్, వెర్షన్ 20 హెచ్ 2 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్)