ఆపిల్ ఐఫోన్ కొత్త అప్ డేట్.. యూజర్లు ఇప్పుడు ఈ గొప్ప ఫీచర్లు చూడవచ్చు..
ఐఓఎస్ 16.1తో ఐఫోన్ యూజర్లు కాపీ-పేస్ట్ ఫంక్షనాలిటీ, లైవ్ యాక్టివిటీ అండ్ ఛార్జింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌లపై మరింత డీప్ కంట్రోల్ పొందుతారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆపిల్ ఐఓఎస్ 16ని ప్రవేశపెట్టింది.
మీరు ఐఫోన్ వాడుతున్నారా అయితే, మీకో గుడ్ న్యూస్ ఉంది. ఆపిల్ ఐఓఎస్ 16, ఐఓఎస్ 16.1 కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ అప్ డేట్ అక్టోబర్ 24 సోమవారం విడుదల చేయబోతోంది. ఐఓఎస్ 16.1 ప్రస్తుతం బీటా వెర్షన్ కోసం రిలీజ్ చేసింది.
ఐఓఎస్ 16.1తో ఐఫోన్ యూజర్లు కాపీ-పేస్ట్ ఫంక్షనాలిటీ, లైవ్ యాక్టివిటీ అండ్ ఛార్జింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌లపై మరింత డీప్ కంట్రోల్ పొందుతారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆపిల్ ఐఓఎస్ 16ని ప్రవేశపెట్టింది. దాని తర్వాత ఐఫోన్ 14 సిరీస్ ఐఓఎస్ 16తో ప్రారంభించింది.
ఆపిల్ ఐఓఎస్ 16.1 ప్రకటనతో ఐపాడ్ ఓఎస్ 16 రోల్ అవుట్‌ను కూడా ప్రకటించింది. అయితే, ఆపిల్ ఐఓఎస్ 16.1, ఐపాడ్ ఓఎస్ 16లను ఒకేసారి ప్రవేశపెట్టవచ్చని ముందే ఊహించారు. ఐఓఎస్ 16 ఐఫోన్ యూజర్లు సోమవారం కొత్త అప్‌డేట్‌ను పొందుతారు. అలాగే, ఐఫోన్ 8, ఐఫోన్ 9తో తాజా ఐఫోన్ వినియోగదారులందరూ ఐఓఎస్ 16.1 అప్ డేట్ పొందుతారు.
ఐఓఎస్ 16.1 ఫీచర్లు
ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త అప్‌డేట్‌లో చాలా పెద్ద మార్పులను చూడవచ్చు. ఈ అప్‌డేట్ తర్వాత, ఐఫోన్ యూజర్లు ఆపిల్ వాచ్ లేకుండా కూడా ఆపిల్ Fitness+కి సబ్ స్క్రైబ్ పొందగలరు. అంతేకాకుండా కొత్త సాఫ్ట్‌వేర్ అప్ డేట్ iCloud షేర్డ్ ఫోటో లైబ్రరీకి సపోర్ట్ తో వస్తుంది. అంటే మీరు మీ ఫోటోను గరిష్టంగా ఐదుగురుతో షేర్ చేయవచ్చు, ఇంకా ఫోటోలను ఎడిట్ చేయడానికి అలాగే వాటిని లైబ్రరీ నుండి డిలెట్ చేయడానికి కూడా యాక్సెస్ లభిస్తుంది.
మరోవైపు, ఐఓఎస్ 16.1తో మీరు కాపీ-పేస్ట్ పై మరింత డీప్ కంట్రోల్ పొందుతారు. అంటే మీరు ఇతర యాప్‌ల నుండి కంటెంట్‌ను పేస్ట్ చేయడానికి యాప్ ప్రతిసారీ మీ పర్మిషన్ అడుగుతుంది. ఇప్పుడు మీరు దీన్ని పర్మనెంట్ గా ఆమోదించవచ్చు లేదా మీరు రిజెక్ట్ చేయవచ్చు. అలాగే, కొత్త అప్‌డేట్‌లో లైవ్ యాక్టివిటీ, లైవ్ ట్రాకింగ్ ఫీచర్, ఛార్జింగ్‌లో అప్‌డేట్‌లు కనిపిస్తాయి.