సారాంశం

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన ఆపిల్‌పై ఓ వ్యక్తి దావా వేశారు. ఓ వ్యక్తి ఆపిల్ 'డిలేట్ మెసేజెస్'  గురించి ట్రాన్స్పరెంట్  లేకపోవడం వల్ల తన భార్య విడాకుల కోసం దాఖలు చేయడానికి దారితీసిందని పేర్కొన్నాడు.

 ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన ఆపిల్‌పై ఓ వ్యక్తి దావా వేశారు. వాస్తవానికి అతని ఫోన్‌లో అతని భార్య సెక్స్ వర్కర్లకు పంపిన మెసేజెస్ కనుగొంది, అయితే అతను ఆ మెసేజెస్ ముందే డిలేట్ చేసినట్లు ఖచ్చితం చేసాడు. టైమ్స్ ప్రకారం,  పేరును  వెల్లడించని ఆ వ్యక్తి ఆపిల్ 'డిలేట్ మెసేజెస్'  గురించి ట్రాన్స్పరెంట్  లేకపోవడం వల్ల తన భార్య విడాకుల కోసం దాఖలు చేయడానికి దారితీసిందని పేర్కొన్నాడు.

మెసేజ్ డిలీట్ అయిందని చూపిస్తే అది డిలీట్ అయిందని నమ్మే హక్కు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ అతని భార్య ఫ్యామిలీ  ఐమ్యాక్ కంప్యూటర్‌లో పంపిన మెసేజెస్ కనిపెట్టింది.

'నా భార్యకి డిలీట్ చేసిన మెసేజ్‌లు కనిపించకుండా ఉంటె ఇంకా పెళ్లయి ఉండేది' అని అన్నారు. 

తన భార్య డిలీట్ చేసిన మెసేజ్‌లను కనుగొనకుంటే తనకు ఇంకా పెళ్లయి ఉండేదని బాధిత యువకుడు అభిప్రాయపడ్డాడు. అతను ఇప్పుడు విడాకులు, న్యాయపరమైన ఖర్చుల కోసం $5 మిలియన్ల కంటే పైగా నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నాడు. డిలేట్ చేసిన  మెసేజెస్  స్టేటస్ గురించి Apple వినియోగదారులకు స్పష్టంగా చెప్పలేదని న్యాయ సంస్థ వాదించింది. 

 

View post on Instagram
 

 

మీ iPhoneలో మెసేజెస్  పర్మనెంట్ గా డిలేట్ చేయడం ఎలా:

1. ముందుగా మీ iPhoneలో మెసేజెస్  యాప్‌ ఓపెన్ చేయండి.
2. ఇక్కడ మీ మెసేజెస్ చాట్ లిస్టులో  పైన-ఎడమ మూలలో ఎడిట్ పై నొక్కండి, తరువాత  recently  deleted  సెలెక్ట్ చేసుకోండి  లేదా పైన-ఎడమ మూలలో ఫిల్టర్‌ నొక్కండి, ఆపై  recently  deleted  సెలెక్ట్ చేసుకోండి .
3. మీరు పర్మనెంట్ గా డిలేట్ చేయాలనుకుంటున్న  చాట్  లేదా మెసేజెస్  సెలెక్ట్ చేసుకోండి.
4. ఇప్పుడు డిలీట్ నొక్కి  కన్ఫర్మేషన్  స్క్రీన్ ఇండికేషన్స్  అనుసరించండి.

ఈ స్టెప్స్ అనుసరించడం ద్వారా  ఆపిల్ డివైజెస్  నుండి  మెసేజెస్  పూర్తిగా తొలగించవచ్చు. 

 మీరు ఎవరు చూడకూడదనుకుంటే  లేదా మీ Apple డివైజ్ (iPhone, Mac, ఏదైనా) నుండి సీక్రెట్ మెసేజెస్ పంపాలని ప్లాన్ చేస్తున్నట్లయితే బెస్ట్ అప్షన్ పర్సనల్ Apple IDని ఉపయోగించడం అయితే ఈ ఐడి మీ  ఫ్యామిలీ Mac డివైజెస్ లేదా ఇతర డివైజెస్ లో  ఉపయోగించకపోవడం మంచిది.