Asianet News TeluguAsianet News Telugu

మరో దెబ్బ: ఇప్పుడు ఒప్పో స్మార్ట్ ఫోన్‌తో కూడా ఛార్జర్ కట్.. దీని ధర ఎంతో తెలుసా..?

ఒకవేళ ఒప్పో నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటే చార్జర్ అందించని స్యామ్సంగ్, ఆపిల్, షియోమీ  లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా, ఛార్జింగ్ అడాప్టర్ సేల్స్ కూడా ఒప్పో  స్టోర్‌లో ప్రారంభమవుతుంది. 

another blow: Now even Oppo will not give charger with the phone
Author
First Published Sep 2, 2022, 1:40 PM IST

స్యామ్సంగ్, ఆపిల్, షియోమీ తర్వాత ఇప్పుడు ఒప్పో కూడా ఫోన్‌తో ఛార్జర్‌ను అందించకూడదని నిర్ణయించుకుంది. ఛార్జర్ ఏ డివైజెస్ కి తొలగించనుందో ఇంకా తెలియనప్పటికీ త్వరలో ఓ ఫోన్ లాంచ్ సందర్భంగా ఒప్పో అధికారికంగా ప్రకటించవచ్చు.  అయితే ప్రస్తుతం ఒప్పో ఫోన్ బాక్స్‌లో సూపర్ వూక్ ఛార్జర్ అందిస్తుంది.

ఒక టెక్నాలజీ న్యూస్ వెబ్‌సైట్  మొదట ఛార్జర్‌ తొలగింపు  గురించి సమాచారాన్ని అందించింది. రాబోయే ఫోన్‌లకు ఛార్జర్ సప్లయ్ చేయబడదని ఒప్పోలోని ఓవర్సీస్ సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ బిల్లీ జాంగ్ చెప్పినట్లు నివేదికలో తెలిపింది. ఒప్పో  ఈ నిర్ణయం రానున్న 12 నెలల్లో అన్ని ఫోన్స్ కి వర్తింపచేయనుంది.  

ఒకవేళ ఒప్పో నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటే చార్జర్ అందించని స్యామ్సంగ్, ఆపిల్, షియోమీ  లిస్ట్ లో చేరుతుంది. అంతేకాకుండా, ఛార్జింగ్ అడాప్టర్ సేల్స్ కూడా ఒప్పో  స్టోర్‌లో ప్రారంభమవుతుంది. ఒప్పో  ఈ నిర్ణయం వన్ ప్లస్ పై కూడా ప్రభావం చూపుతుంది, ఎందుకంటే రెండింటికీ ఒకే పేరెంట్ కంపెనీ ఉంది. సమాచారం ప్రకారం వన్ ప్లస్ ఈ విషయంపై ఇంకా  స్పందించలేదు.

తాజాగా షియోమీ ఇండియాలో ఛార్జర్ లేకుండా రెడ్ మీ నోట్ 11SEని ప్రవేశపెట్టింది. ఛార్జర్ లేకుండా ఇండియాలో లాంచ్ చేసిన మొదటి షియోమీ స్మార్ట్‌ఫోన్ ఇదే. రెడ్ మీ నోట్ 11SEని రూ. 13,499 ధరతో లాంచ్ చేశారు. దీని ఛార్జర్ ధర రూ. 199. మీరు ఫోన్ ఇంకా ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేస్తే, మీరు ఛార్జర్ కోసం రూ.499 చెల్లించాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios