Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది: స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ పై భారీ ఆఫర్లు, కూల్ డీల్స్ కూడా..

ఈ ప్రైమ్ డే సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గృహోపకరణాలు, ఫ్యాషన్, అమెజాన్ డివైజెస్, కిచెన్ ఉపకరణాలు, కిరాణా సామాగ్రి ఇంకా  వినియోగ వస్తువులతో టాప్ భారతీయ ఇంకా ప్రపంచ బ్రాండ్‌ల నుండి 45,000+ కొత్త ఉత్పత్తులను చూడవచ్చు.
 

Amazon Prime Day is Coming:  know Huge Offers and Cool Deals-SAK
Author
First Published Jul 1, 2023, 4:03 PM IST

అమెజాన్ ప్రైమ్ డే 2023 సేల్ వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూన్ 15, 16 తేదీల్లో జరగనుంది. ఈ సందర్భంగా అమెజాన్ భారీ డీల్స్‌ను ప్రవేశపెట్టనుంది ఇంకా  కస్టమర్లు భారీ లాభంతో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దానితో పాటు ప్రైమ్ వీడియో కొత్త ఎంటర్టైన్మెంట్  కూడా సిద్ధం చేస్తుంది. 

ఈ ప్రైమ్ డే సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గృహోపకరణాలు, ఫ్యాషన్, అమెజాన్ డివైజెస్, కిచెన్ ఉపకరణాలు, కిరాణా సామాగ్రి ఇంకా  వినియోగ వస్తువులతో టాప్ భారతీయ ఇంకా ప్రపంచ బ్రాండ్‌ల నుండి 45,000+ కొత్త ఉత్పత్తులను చూడవచ్చు.

ప్రైమ్ డే సేల్ రోజున అమెజాన్ ప్రైమ్ యూజర్లకు భారీ ఆఫర్ లభించనుంది. భారతదేశంతో సహా 25 దేశాల్లోని ప్రైమ్ యూజర్లు ఈ ఆఫర్‌లను పొందుతారు. అమెజాన్  ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్ స్క్రిప్షన్ ఒక సంవత్సరానికి రూ.1499. ఫాస్ట్  డెలివరీ, ఆన్ లిమిటెడ్ వీడియో, యాడ్స్ లేకుండా మ్యూజిక్ , ప్రత్యేక డీల్‌లు, ఉచిత మొబైల్ గేమ్‌లు ఇంకా  ఎన్నో  ఇతర ఆఫర్‌లు ప్రైమ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. 

ప్రైమ్ వినియోగదారులు పొందే అతిపెద్ద ప్రయోజనం ఫాస్ట్ డెలివరీ. భారతదేశంలోని ఎంపిక చేసిన 25 నగరాల్లో ఆర్డర్ చేసిన ఉత్పత్తి ఆర్డర్ చేసిన రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేయబడుతుంది. అమెజాన్ భారతదేశంలోని అన్ని ప్రముఖ  టైర్ టూ నగరాల్లోని ప్రైమ్ వినియోగదారులకు ఈ సేవను అందిస్తోంది.

ఈసారి, Amazon Echo ఇంకా  Fire TV కోసం Amazon భారీ ఆఫర్‌ను అందిస్తోంది. అంతే కాకుండా స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఈ ఆఫర్‌లో ఉన్నాయి. దీనితో పాటు, అమెజాన్ ప్రైమ్ వీడియోలో పేమెంట్ ఛానెల్‌లకు సభ్యత్వం పొందిన ప్రైమ్ వినియోగదారులు ప్రైమ్ డేలో 50 శాతం ఆఫర్‌ను పొందుతారు. 

అమెజాన్ ప్రైమ్ డే రోజున, Amazon Pay, ICICI క్రెడిట్ కార్డ్ కొనుగోలుదారులు 5 శాతం ఇన్స్టంట్ తగ్గింపును పొందుతారు. ఇంకా ICICI, SBI కార్డులను ఉపయోగించి షాపింగ్ చేసే వారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios