న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా ఈ-కామర్స్’ మేజర్ అమెజాన్ అనుబంధ అమెజాన్‌ ఇండియా మరో సేల్‌కు సిద్ధమైంది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి 11వ తేదీ వరకు ‘ఫ్రీడమ్‌ సేల్‌ 2019’ను ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు యూజర్లకు 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందించనున్నది. 

అమెజాన్ ఇంకా ఆఫర్లు, డిస్కౌంట్లు వెల్లడించకున్నా.. తాజాగా మార్కెట్లోకి విడుదలైన హువావే ప్రైమ్ ‘వై9’ ఫోన్ పైనా రాయితీలు అందుబాటులోకి తేనున్నది అమెజాన్. హువావే ‘వై9’ ప్రైమ్ ఫోన్‌పై ఆకర్షణీయ డిస్కౌంట్లు లభిస్తాయి. 


బజాజ్‌ ఫైనాన్స్‌తోపాటు ఇతర కార్డులపై నోకాస్ట్‌ ఈఎంఐ, డెబిట్‌కార్డు ఈఎంఐ వంటి సదుపాయాలను కల్పిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌ సభ్యులు ఈ నెల ఏడవ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్లు పొందొచ్చు. ఈ సేల్‌లో మొబైల్‌ ఫోన్లు, యాక్సెసరీస్‌, గృహ వినియోగ వస్తువులు, దుస్తులపై ధరలు తగ్గనున్నాయి. ఆ ధరలను అమెజాన్ ఇండియా వెబ్ సైట్ పేజీలో వెల్లడించనున్నది. 

మొబైల్‌ కొనుగోలుదారులకు కోసం పెద్ద ఎత్తున ఆఫర్లను అమెజాన్‌ తీసుకొస్తోంది. రూ.48,999 ధర పలుకుతున్న వన్ ప్లస్ 7 ప్రో ఫోన్‌పై అదనపు డిస్కౌంట్ లభించనున్నది. నో ఈఎంఐ కాస్ట్ ఆప్షన్ కూడా లభిస్తుంది. వన్ ప్లస్ 7 ప్రో ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ పాప్ అప్ సెల్ఫీ కెమెరా, స్నాప్ డ్రాగ్ 855 ఎస్వోసీతోపాటు 4000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ లభిస్తుంది. 

వీటితో పాటు వన్‌ప్లస్‌ 7, ఒప్పొ రెనో, వివో వీ15, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9, ఒప్పొ ఎఫ్‌11 ప్రో ఫోన్లపై ఎక్స్‌ఛేంజ్‌పై అధిక డిస్కౌంట్‌ ఇవ్వనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌10, శాంసంగ్‌ ఎం40, ఎం30, ఎం20, రెడ్‌మీ వై3, ఒప్పొ ఏ7, ఆనర్‌ వ్యూ20, ఒప్పొ కే3 వంటి మోడళ్లపై తగ్గింపు ధరలు ప్రకటించనుంది. ఎంతమొత్తంలో తగ్గిస్తారనేది అమెజాన్‌ వెల్లడించలేదు.

వీటితోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచీలు, కెమెరాలు, వాటి విడి బాగాలపై 50 శాతం వరకు.. హెడ్ ఫోన్లు, స్పీకర్లపై 60 శాతం వరకు రాయితీలు లభించనున్నాయి. లాప్ ట్యాప్ లు రూ.30 వేలకే అందుబాటులోకి రానున్నాయి. రిఫ్రిజిరేటర్లపై రూ.35 వేల వరకు, వాషింగ్ మిషన్లపై రూ.11 వేల వరకు ఆదా చేయొచ్చు. టెలివిజన్, ఏసీలపై 50 శాతం రాయితీలు లభిస్తాయి. ఎచో డివైజెస్, ఫైర్ టీవీ స్టిక్, కైండిల్ రేంజ్ తదితర వస్తువుల ధరలు రూ.5000 తగ్గించనున్నారు.