ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ మరోసారి కష్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. జియోకి పోటీగా మరింత ఎక్కువ మొబైల్ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఎయిర్‌టెల్ రూ.649 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అందిస్తున్న మొబైల్ డేటా పరిమితిని మరింత పెంచింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో కస్టమర్లకు బిల్ సైకిల్‌లో 50 జీబీ డేటా మాత్రమే లభించేది. కానీ ఇకపై 90 జీబీ డేటా లభిస్తుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. 

దీంతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ యథావిధిగా ఈ ప్లాన్‌లో వస్తాయి. ఇక వీటితోపాటు వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ టీవీ ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఉచిత హ్యాండ్ సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌లు లభిస్తాయి.