కాలిఫోర్నియా: వీడియో కమ్యూనికేషన్స్ సంస్థ అయిన జూమ్ తాజాగా ఒక కొత్త ప్రకటన చేసింది. మే 30, 2020లో రిలీజ్ కానున్న కొత్త అప్ డేట్   నూతన వెర్షన్‌నే ఉపయోగించాలని వినియోగదారులని  కోరింది. కొత్తగా రానున్న జూమ్ 5.0 లేటెస్ట్ వెర్షన్ లో మరింత మెరుగైన ఫీచర్లు, సెక్యూరిటి అప్ డేట్ ఉన్నాయని  తెలిపింది.

మరోవైపు భారతలో వినియోగదారుల గోప్యతకు జూమ్‌ వీడియో కాలింగ్‌ యాప్‌ భంగం కలిగిస్తుందని ఇటవల సుప్రీం కోర్టులో హర్ష్‌ చుగ్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ యాప్‌ వినియోగిస్తున్న పలువురి నుంచి హ్యాకింగ్‌, సైబర్‌ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని ఫిర్యాదులో పిటిషన్‌దారుడు పేర్కొన్నారు.

మాషాబుల్  ప్రకారం, కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో మే 30, 2020 నుండి మొత్తం  జూమ్ క్లయింట్లు, జూమ్ రూములు ఏదైనా మీటింగ్ రూమ్స్ లో  చేరాలంటే కొత్త  వెర్షన్ 5.0 లేదా అంతకంటే ఎక్కువ అప్ డేట్ కలిగి ఉండాలి.

also read మొబిక్విక్​పై వేటు.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు!

ప్రస్తుతం కంపెనీ జూమ్‌ రూమ్స్‌, సిస్టమ్స్‌, వైర్‌లెస్‌ సేవలను  యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్‌ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్‌ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

యూజర్లకు కొత్త  వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలంటే వీలైనంత త్వరగా అడ్మిన్‌ పోర్టల్‌కు లాగిన్‌ అయ్యి జూమ్‌ రూమ్స్‌ కంట్రోలర్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవలని కంపెనీ సూచించింది.కాబట్టి, జూమ్ రూమ్స్ కంట్రోలర్లు (జూమ్ రూమ్స్ షెడ్యూలింగ్ డిస్ ప్లేలతో సహా) కనీస లేటెస్ట్ వెర్షన్ ఉండకపోతే యాప్ పనిచేయవు అని తెలిపింది.