ముంబై :ఫుడ్ టెక్ యునికార్న, ఆన్ లైన్ ఫుడ్ ఆర్డరింగ్ సంస్థ జోమాటో జూలైలో దాని నికర నష్టం 1 మిలియన్ కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. అయితే లాక్ డౌన్ సడలింపుతో తిరిగి ప్రాంరంభమైన ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సర ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది.

2020లో జోమాటో ఆదాయం గతేడాది ఆదాయం 192 మిలియన్ డాలర్ల (రూ 1,440 కోట్లు) తో పోల్చితే 105 శాతం పెరిగి 394 మిలియన్ డాలర్లకు చేరుకుందని, అదే సమయంలో ఖర్చులు కేవలం 47 శాతం మాత్రమే పెరిగాయని జోమాటో తెలిపింది.

అయితే కంపెనీ పన్ను చెల్లింపుల కంటే ముందు (ఎబిటా) 293 మిలియన్ డాలర్లు (రూ 2,197 కోట్లు) నష్టాలను చవిచూసింది. కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో 75 శాతం జోమాటో ఉద్యోగులు పాక్షిక వేతన కోతలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

also read తొలగని కరోనా ముప్పు: టెకీలకు పొంచిఉన్న ఉద్యోగ గండం ... ...

జోమాటో సాధారణంగా తన వార్షిక నివేదికను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తుంది. కానీ ఈ సంవత్సరం కరోనా వైరస్ మహమ్మారి వల్ల కలిగే అనిశ్చితుల కారణంగా నివేదిక విడుదల ఆలస్యం అయింది. గడిచిన ఆర్ధిక సంవత్సరంలో జొమాటో 277 మిలియన్ డాలర్లు (రూ 2,077 కోట్లు) నష్టం వచ్చింది.

ఈ నష్టాలు పూర్తిస్థాయి నికర నష్టాలను ప్రతిబింబిచకపోయినా, కంపెనీ మాత్రం తమ రుణాలు తక్కువగా ఉన్నాయని, దీంతో నికర నష్టాలు కూడా దాదాపు ఎబిటా నష్టాలకు దగ్గరగా ఉంటాయని తెలిపింది.

గతేడాదితో పోలిస్తే 47శాతం పెరిగినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో సంస్థ అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి "అని జోమాటో సీఈవో దీపిందర్ గోయల్ అన్నారు.