ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో యాహూ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.. ఆన్ లిమిటెడ్ టాక్‌టైమ్, 4జి డేటా కూడా..
ఈ స్మార్ట్‌ఫోన్‌ను జెడ్‌టిఇ తయారు చేసింది, దీనిని బ్లేడ్ ఎ3వై అని పిలుస్తారు. ఈ ఫోన్‌లో 5.45-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన యాహూ మొబైల్ సర్వీసును మరింత పెంచే లక్ష్యంతో వెరిజోన్ మొట్టమొదటి యాహూ-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జెడ్‌టిఇ తయారు చేసింది, దీనిని బ్లేడ్ ఎ3వై అని పిలుస్తారు.
ఈ ఫోన్‌లో 5.45-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ తో నడుస్తుంది.
యాహూ మొబైల్ జెడ్‌టిఇ బ్లేడ్ ఎ3వై ధర
యాహూ మొబైల్ జెడ్‌టిఇ బ్లేడ్ ఎ3వై ధర 50 డాలర్లు (ఇండియాలో సుమారు రూ.3,700), యాహూ మొబైల్ జెడ్‌టిఇ బ్లేడ్ ఎ3వై వెరిజోన్ నెట్‌వర్క్‌లో యాహూ మొబైల్ సర్వీసుతో లభిస్తుంది, ఇది ఆన్ లిమిటెడ్ టాక్‌టైమ్, టెక్స్ట్, 4జి ఎల్‌టిఈ డేటాను యూఎస్ లో నెలకు 40 డాలర్లు (సుమారు రూ. 2,900) కు అందిస్తుంది.
ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి ఎలాంటి ప్రకటనలు లేకుండా యాహూ మెయిల్ ప్రో కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం మార్చిలో వెరిజోన్ కొత్త యాహూ సబ్-బ్రాండ్‌ను ప్రకటించింది.
యాహూ మొబైల్ జెడ్‌టిఇ బ్లేడ్ ఎ3వై ఫీచర్స్
అధికారిక వెబ్‌సైట్ ప్రకారం యాహూ మొబైల్ జెడ్‌టిఇ బ్లేడ్ ఎ3వైలో 5.45-అంగుళాల హెచ్‌డి (720x1440) ఫుల్‌విజన్ డిస్‌ప్లే, క్వాడ్ కోర్ మీడియాటెక్ హెలియో ఏ22 SoC, 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 128జిబి వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 2,660 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఫోటోలు, వీడియోల కోసం యాహూ మొబైల్ జెడ్‌టిఇ బ్లేడ్ ఎ3వై రెండు డ్యూయల్ ఎల్‌ఇడి ఫ్లాష్‌తో సింగల్ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 161.8 గ్రాముల బరువు ఉంటుంది.