ఈ-కామర్స్  దిగ్గజం అమెజాన్ దీపావళి సందర్భంగా అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 సేల్ 'గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్' పేరుతో డిస్కౌంట్ అఫర్లను తీసుకువచ్చింది. ఈ సేల్ ద్వారా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ పై డీల్స్ తో తగ్గింపు ధరలు ఆఫర్ చేస్తోంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ ఎడిషన్ నవంబర్ 4తో ముగుస్తుంది, కానీ సేల్స్ కొనసాగుతూనే ఉంటుంది.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020  సేల్స్ కోసం అమెజాన్ సిటిబ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో సహా పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. రుపే కార్డు వినియోగదారులు కూడా ఈ ఆఫర్లకు అర్హులు.   

also read పబ్‌జీ గేమ్ లవర్స్ కి షాక్.. ఇండియాలోకి మళ్ళీ ఇక రాదు, ఉండదు.. ...

ప్రొడక్టులపై డిస్కౌంట్ మాత్రమే కాకుండా పలు రకాల బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తోంది. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు రూ.1,500 వరకు తగ్గింపు పొందొచ్చు.

రుపేకార్డుపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్  కూడా ఇస్తుంది. దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి కూడా ఉన్నాయి.  

దీపావళి ప్రత్యేక సేల్ సందర్భంగా  ఆపిల్ ఐఫోన్ 11 రూ. 49,999కే అందిస్తుది, దీని అసలు ధర రూ .64,900. అలాగే ఐఫోన్ 11పై 16,400 రూపాయల ఎక్జ్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.