వాట్సాప్‌లో లేటెస్ట్ ఫీచర్... ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన కూడా...
మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూ యూసర్లని కొత్త కొత్త ఫీచర్లతో ఆకర్షిస్తుంది.అంతకు ముందు వాట్సాప్ డార్క్ మోడ్ థీమ్ ప్రవేశపెట్టింది తరువాత వీడియో కాల్స్ మరో కొత్త ఫీచర్ తీసుకు రాగా ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూ యూసర్లని కొత్త కొత్త ఫీచర్లతో ఆకర్షిస్తుంది.
అంతకు ముందు వాట్సాప్ డార్క్ మోడ్ థీమ్ ప్రవేశపెట్టింది తరువాత వీడియో కాల్స్ మరో కొత్త ఫీచర్ తీసుకు రాగా ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది.
అదేంటంటే సాధారణంగా ఫోన్ ఆన్ చేసి ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటేనే గానీ వాట్సాప్ పని చేయదు మెసేజెస్ కూడా రావు. చాలా మందికి ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే ఫోన్ ఆఫ్ అవుతుంది దీంతో వాట్సాప్ వాడటానికి అవకాశం ఉండదు.
also read జియో యూజర్లకు గుడ్ న్యూస్: లాక్ డౌన్ ఉన్నంత వరకు కాల్స్ ఉచితం...
ఇందుకోసం వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఇక మీదట ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ఫీచర్ త్వరలోనే రాబోతోంది. దీని కోసం వాట్సాప్ మాతృ సంస్థ యూనివర్సల్ విండోస్ సరికొత్త ఫ్లాట్‌ఫాంని రూపొందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఇక మీదట వెబ్‌లో వాట్సాప్‌ను ఫోన్ లేకుండానే పొందవచ్చు.
కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉందని త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.