మాపై పుకార్లను నమ్మొద్దు.. కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్‌..

ఈ కొత్త ప్రైవసీ పాలసీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన మెసేజెస్ గోప్యతను ఏ విధంగానూ ప్రభావితం చేయదని పేర్కొంది. 

WhatsApp Clarifies on Privacy Policy Update Amid Criticism, Says No Effect on personal Chats

ఫేస్ బుక్ యజమాన్యంలోని వాట్సాప్ మంగళవారం  ప్రైవసీ పాలసీ అప్ డేట్ పై స్పష్టత ఇచ్చింది. ఈ కొత్త ప్రైవసీ పాలసీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన మెసేజెస్ గోప్యతను ఏ విధంగానూ ప్రభావితం చేయదని పేర్కొంది.  అయితే ఇవన్నీ పుకార్లనీ.. వాటికి తాము సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫార్మ్ వాట్సాప్ పై వస్తున్న పుకార్లకు తాము సమాధానం ఇవ్వాలని కోరుకుంటుందని, ఆ బాధ్యత తమకు ఉందని వాట్సాప్‌ తెలిపింది. మీ పర్సనల్ చాట్ కి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందని పునరుద్ఘాటించింది. మీ ప్రైవేట్ చాట్ మెసేజెస్ చూడటం లేదా మీ కాల్స్ వినటం సాధ్యం కాదని చెప్పింది.

వాట్సాప్ మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ కూడా దాని వినియోగదారుల మెసేజెస్ లేదా కాల్‌లను కూడా చదవలేదనే విషయాన్ని నొక్కి చెప్పింది. గత వారం జరిగిన ప్రైవసీ పాలసీ అప్ డేట్ పై వాట్సాప్‌కు వ్యతిరేకంగా ప్రజల విమర్శల మధ్య ఈ కొత్త అభివృద్ధి వచ్చింది. అయితే వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుండి అమలులోకి రానున్న సంగతి మీకు తెలిసిందే.

also read స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తున్న రెడ్‌మి అప్‌గ్రేడ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తేలుసుకొ...

 ప్రైవసీ పాలసీ అప్ డేట్ పై వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తూ, వాట్సాప్ తన వెబ్ సైట్‌లో కొత్త ఎఫ్‌ఏ‌క్యూ పేజీని విడుదల చేసింది, ఇది యాప్ లో ప్రైవేట్ కమ్యూనికేషన్‌ను హైలైట్ చేస్తుంది.

“వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ మీ మెసేజులను చూడలేదు, మీ స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులకు చేసిన మీ వాట్సాప్‌   కాల్స్ వినలేవు. మీరు ఏది షేర్ చేసుకున్నా అది మీ మధ్య ఉంటుంది. మా  ప్రైవసీ పాలసీ అప్ డేట్ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మీ మెసేజెస్ ప్రైవసీ ని ప్రభావితం చేయదు." ”అని వాట్సాప్‌  తెలిపింది.

 వాట్సాప్ వినియోగదారు డివైజ్  ఖచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని సేకరించి ఉపయోగిస్తుందని గమనించడం ముఖ్యం. “మీరు మా లొకేషన్ -సంబంధిత ఫీచర్ ఉపయోగించకపోయినా, మీ సాధారణ లొకేషన్ (ఉదా., నగరం/దేశం) అంచనా వేయడానికి మేము ఐ‌పి అడ్రస్, ఫోన్ నంబర్ ఏరియా కోడ్‌ల వంటి సమాచారాన్ని ఉపయోగిస్తాము.

మేము మీ లేకేషన్ సమాచారాన్ని డయాగ్నస్టిక్స్, ట్రబుల్షూటింగ్ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తాము, ”అని  ప్రైవసీ పాలసీలో పేర్కొంది. అదేవిధంగా మా ప్లాట్‌ఫామ్‌లోని గ్రూప్ చాట్‌లు ప్రైవేట్‌గా, ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్ట్ చేయబడిందని వాట్సాప్ తెలిపింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios