స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తున్న రెడ్‌మి అప్‌గ్రేడ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తేలుసుకొండి..

స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రెడ్‌మి కె40 లాంచ్ కానుంది. ఈ సమాచారాన్ని రెడ్‌మి లు వీబింగ్ జనరల్ మేనేజర్ ఇచ్చారు. రెడ్‌మి కె40 సిరీస్ గత ఏడాది ప్రారంభించిన రెడ్‌మి కె30 సిరీస్ కి అప్‌గ్రేడ్ వెర్షన్.

redmi k40 to launch with snapdragon 888 soc next month in india price revealed

మీరు కూడా రెడ్‌మి కె40 స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా, అయితే ఈ వార్త మీకోసమే. రెడ్‌మి కె40 వచ్చే నెలలో చైనాలో విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రెడ్‌మి కె40 లాంచ్ కానుంది. ఈ సమాచారాన్ని రెడ్‌మి లు వీబింగ్ జనరల్ మేనేజర్ ఇచ్చారు.

రెడ్‌మి కె40 సిరీస్ గత ఏడాది ప్రారంభించిన రెడ్‌మి కె30 సిరీస్ కి అప్‌గ్రేడ్ వెర్షన్. రెడ్‌మి జనరల్ మేనేజర్ ప్రకారం, రెడ్‌మి కె40 ధర 2,999 చైనీస్ యువాన్లు, అంటే ఇండియాలో సుమారు 34,000 రూపాయలు. ఈ ధర బేస్ వేరియంట్‌, ఇందులో ప్రీమియం వేరియంట్ కూడా ఉంది, ఇది ఎక్కువ ర్యామ్‌తో ఎక్కువ స్టోరేజ్ పొందుతుంది. 

ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం రెడ్‌మి కె40 అమోలెడ్ డిస్‌ప్లే, అతిపెద్ద బ్యాటరీతో క్లెయిమ్ చేయబడింది, కానీ బ్యాటరీ సామర్థ్యం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

 ఇంతకుముందు కూడా రెడ్‌మి కె40 గురించి కొంత సమాచారం లీక్ అయింది, దీని ప్రకారం రెడ్‌మి కె40లో పాప్ అప్ సెల్ఫీ కెమెరా ఉండదు. కానీ రెడ్‌మి కె30 సిరీస్‌లో పాప్ అప్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. రెడ్‌మి కె40 సిరీస్ ఫోన్‌లలో పంచ్‌హోల్ డిస్‌ప్లే చూడవచ్చు. ఇవి కాకుండా క్వాడ్ కెమెరా సెటప్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లభిస్తాయి.

also read టిక్‌టాక్ వసూళ్ల వర్షం.. ఇండియాలో బ్యాన్ చేసిన టాప్ ప్లేస్ లోకి.. ...

గత ఏడాది అక్టోబర్‌లో షియోమి కె సిరీస్ కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి కె30ఎస్‌ను చైనాలో విడుదల చేసింది. రెడ్‌మి కె30, రెడ్‌మి కె30 ప్రో, రెడ్‌మి కె30 అల్ట్రా తర్వాత ఈ సిరీస్‌లో ఇది నాల్గవ ఫోన్, ఇది ఎం‌ఐ 10 టి రీబ్రాండెడ్ వెర్షన్. రెడ్‌మి కె30 ఎస్ 144 హెర్ట్జ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది కాకుండా స్నాప్ డ్రాగన్  865 ప్రాసెసర్ ఉంది. రెడ్‌మి కె30 ఎస్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు.

రెడ్‌మి కె30ఎస్ స్పెసిఫికేషన్

ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ ఎంఐయూఐ 12 ఉంది. 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది.

రెడ్‌మి కె30ఎస్‌లో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి, ప్రధాన లెన్స్ 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్‌ఎక్స్ సెన్సార్ కెమెరా, రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్ కెమెరా, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా, సెల్ఫీ కోసం 20 మెగాపిక్సెల్ లెన్స్ కెమెరా ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios