వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు  డబుల్ డేటా ఆఫర్‌  ప్రకటించింది.  మూడు ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్‌లను కొత్తగా  ప్రవేశపెట్టింది. రూ. 249, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు వోడాఫోన్, ఐడియా కస్టమర్లకు 84 రోజుల వరకు వాలిడిటీతో అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్లాన్లు ఇప్పటికే రోజు 1.5జి‌బి డేటాను అందిస్తున్నాయి. దీనికి అదనంగా  మరో1.5జి‌బి  డేటాను అందిస్తుంది.ప్రస్తుతం ఈ ఆఫర్ 23 టెలికాం సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. భారీ ఏ‌జి‌ఆర్ బకాయిలు, రిలయన్స్ జియో బలమైన పోటీ కారణంగా వోడాఫోన్ ఐడియా దేశంలో మనుగడ సాగించడానికి చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ డబుల్ డేటా ఆఫర్ ను ప్రవేశపెట్టింది.

also read ఆపిల్‌ ఐఫోన్ల ధరలు పెంపు...ఎందుకంటే ?

ఇది ఇలా వుంటే ఏజీఆర్‌  బకాయిల చెల్లింపుల వివాదంలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వొడాఫోన్‌ గ్లోబల్‌ సీఈవో నిక్‌ రీడ్‌ కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలవనున్నారు. ఆయన ఇండియా పర్యటన సందర్భంగా టెలికాం మంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.  

వోడాఫోన్, ఐడియా వెబ్‌సైట్లలోని ప్రకారం వినియోగదారులు రోజూ అదనంగా 1.5 జిబి హై-స్పీడ్ డేటాను రూ. 249, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్ ఛార్జ్ ప్లాన్ పై పొందుతారు.అంటే రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్  ద్వారా రోజుకు మొత్తం 3 జిబి హై-స్పీడ్ డేటా 28 రోజుల వాలిడిటీతో  ఉంటుంది.

అలాగే రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల పాటు రోజుకు 3 జీబీ హై-స్పీడ్ డైలీ డేటాను తీసుకువస్తుంది. ఎక్కువ వాలిడిటీ కావాల్సిన కస్టమర్ల కోసం వోడాఫోన్ ఐడియా కూడా 1.5జి‌బి అదనపు హై-స్పీడ్ డేటా ప్రయోజనాలను రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 84 రోజుల వరకు వస్తుంది.

also read విపణిలోకి రెడ్‌మీ నోట్‌ 9 స్మార్ట్ ఫోన్... ఆవిష్కరించనున్న బాలీవుడ్ హీరో

వొడాఫోన్ అదనంగా వోడాఫోన్ ప్లే, జీ5 యాప్స్ కూడా సబ్‌స్క్రైబర్‌ అందిస్తుంది. ఐడియా కస్టమర్లు ఐడియా మూవీస్, ఐడియా టివి యాప్ కూడా యాక్సెస్ పొందుతారు.ఇంకా రూ. 249, రూ. 399, రూ. 599 రీఛార్జ్ ప్లాన్‌లలో భాగంగా రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లతో పాటు ఆన్ లిమిటెడ్ నేషనల్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పొందుతారు.

ఏదైనా  రిటైల్ స్టోర్, ప్రీపెయిడ్ రీఛార్జ్ యాప్ ద్వారా లేదా మై వొడాఫోన్, మై ఐడియా యాప్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. డబుల్ డేటా ప్రయోజనాలను పొందటానికి వినియోగదారులు మూడు ప్రీపెయిడ్ ప్లాన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు.