కేంద్ర బడ్జెట్ 2020లో   దిగుమతి సుంకాలలో చేసిన మార్పులను పేర్కొంటూ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్ ఇంక్. భారతదేశంలో కొన్ని ఆపిల్‌  ఐఫోన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఐఫోన్లను పెంచిన ధరలకే విక్రయిస్తున్నారు.

ఐఫోన్‌ 8, 8ప్లస్‌, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్‌ ఫోన్ల ధరలను పెంచినట్లు ఆపిల్‌ సంస్థ తెలిపింది. ఐఫోన్‌ 7, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్ ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తున్నందున ఈ ఫోన్ల ధరలు పెరగలేదు. ఆపిల్ వాచ్, మాక్ ల్యాప్‌టాప్‌ల ధరలను కూడా పెంచలేదు.

also read విపణిలోకి రెడ్‌మీ నోట్‌ 9 స్మార్ట్ ఫోన్... ఆవిష్కరించనున్న బాలీవుడ్ హీరో

ఐఫోన్‌ 8 (64జీబీ) - పాత ధర రూ.39,900 - కొత్త ధర రూ.40,500
ఐఫోన్‌ 8 (128జీబీ) - రూ.44,900 - రూ.45,500
ఐఫోన్‌ 8 ప్లస్‌ (64జీబీ) - రూ.49,900 - రూ.50,600
ఐఫోన్‌ 8 ప్లస్‌ (128జీబీ) - రూ.54,900 - రూ.55,600
ఐఫోన్‌ 11 ప్రొ (64జీబీ) - రూ.99,900 - రూ.1,01,200
ఐఫోన్‌ 11 ప్రొ (256జీబీ) - రూ.1,13,900 - రూ.1,15,200


ఐఫోన్‌ 11 ప్రొ (512జీబీ) - రూ.1,31,900 - రూ.1,33,200
ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ (64జీబీ) - రూ.1,09,900 - రూ.1,11,200
ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ (256జీబీ) - రూ.1,23,900 - రూ.1,25,200
ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ (512జీబీ) - రూ.1,41,900 - రూ.1,43,200 

also read పెద్ద బ్యాటరీతో హువావే కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్...

భారతదేశంలో ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 7 తయారవుతున్నందున ఆపిల్ సంస్థ వాటి ధరలను పెంచలేదు. ఇతర ఉత్పత్తులు చైనా నుండి దిగుమతి అవుతాయి.ఈ ఏడాది భారతదేశంలో తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ ఇటీవల సమావేశంలో తెలిపారు.

2021లో భారతదేశంలో ఫస్ట్ బ్రిక్, మోర్టార్ రిటైల్ స్టోర్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోందని కుక్ చెప్పారు. ఆపిల్ కంపెనీ తన సొంత రిటైల్ స్టోర్ ఇక్కడ ప్రారంభించడానికి ఇంకా లైసెన్స్ పొందలేదు, కాని ఆపిల్ సంస్థ అందుకోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని చెప్పారు.