వొడాఫోన్ ఐడియా కస్టమర్లను వెంటాడుతున్న నెట్వర్క్ సమస్య...ఎందుకంటే..?

వొడాఫోన్ ఐడియా వినియోగదారులు శుక్రవారం తివ్రమైన సిగ్నల్స్ అంతరాయం ఎదుర్కొంటున్నారు. వొడాఫోన్ ఐడియా సిగ్నల్స్ సమస్య  పరిష్కరించడానికి అంచనా వేసిన సమయాన్ని పేర్కొనకుండా ఇది “తాత్కాలిక సమస్య” అని టెలికాం ఆపరేటర్ పేర్కొంది.

vodafone idea network issue in bengaluru mumbai chennai and hyderabad

బెంగళూరులోని వొడాఫోన్ ఐడియా వినియోగదారులు శుక్రవారం తివ్రమైన సిగ్నల్స్ అంతరాయం ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో కొంతమంది  వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ప్రకారం, టెలికాం ప్రొవైడర్ కనీసం ఒక గంట సెల్యులార్ నెట్‌వర్క్‌ను అందించడం లేదని ఈ సమస్య ఉదయం నుండి ఎదురవుతుంది అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రముఖ నగరాలలోని ప్రధాన జోన్లలో వోడాఫోన్ నంబర్లపై నెట్‌వర్క్ కవరేజ్ లేదని కొందరు వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ సమస్యని సాధారణంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇది టెక్ స్టార్టప్‌లకు తెలిసే ఉంటుంది.

also read గూగుల్‌ మ్యాప్స్‌ 15వ బర్త్ డే స్పెషల్...ఎంటో తెలుసా...?

కొన్ని నివేదికల ప్రకారం వొడాఫోన్ ఐడియా ఈ రోజు ఉదయం నుండి నెట్‌వర్క్ కనెక్టివిటీ తక్కువగా ఉందని చెబుతున్నారు. ఒక ఇంగ్లిష్ వెబ్ సైట్ కు ఇ-మెయిల్ చేసిన ప్రకటనలో వోడాఫోన్ ఈ విషయాన్ని అంగీకరించింది.

“ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుండి వొడాఫోన్‌లో నెట్‌వర్క్ లేదు. IST (7 ఫిబ్రవరి) నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి నెట్వర్క్ కనెక్టివిటీ ఎదురైంది” అని వోడాఫోన్ ఐడియా వినియోగదారులలో ఒకరు ఈ అంతరాయం గురించి ఫిర్యాదు చేస్తూ ట్వీట్ చేశారు. ఇతర వినియోగదారులు కూడా ట్విట్టర్లో ఇలాంటి సమస్యపై వారు నివేదించారు.

vodafone idea network issue in bengaluru mumbai chennai and hyderabad

కస్టమర్ల ఫిర్యాదులపై స్పందిస్తూ ట్విట్టర్‌లోని అధికారిక వోడాఫోన్ అక్కౌంట్  నుండి ఇది తాత్కాలిక సమస్య అని నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యను నిర్ధారించడానికి ఒక బృందాన్ని నియమించినట్లు చెప్పారు. అయితే ఆపరేటర్ ఈ సమస్య పరిష్కరించడానికి అంచనా వేసి ఎంత సమయం పడుతుంది అనే సమాచారం  ఇవ్వలేదు అని బెంగళూరు ప్రాంతంలోని వందలాది మంది వినియోగదారులు మండిపడుతున్నారు.

ఈ సమస్యతో బెంగళూరుతో పాటు, చెన్నై, హైదరాబాద్, ముంబైలలోని ప్రధాన నగరాలలో కొంతమంది వినియోగదారులు వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌ సమస్యని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. Downdetector.in లోని మ్యాప్ కూడా ఈ నెట్వర్క్ సమస్యని చూపిస్తుంది.

also read ‘వొడాఫోన్ ఐడియా’ పోస్ట్​పెయిడ్ సర్వీసు పేరు మార్పు...

ఒక ఇంగ్లిష్ వెబ్ సైట్ ఈ సమస్య పై స్పష్టత కోసం వోడాఫోన్ ఐడియాకు సంప్రదించగ వారు ఏ విధంగా స్పందించారు "నగరంలోని శివారు ప్రాంతాలలో ఫైబర్ వైర్ల సమస్య కారణంగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు నెట్వర్క్ సేవల్లో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది.

మా స్టాఫ్ దీనిపై తక్కువ సమయంలోనే  నెట్వర్క్ సేవలను పూర్తిగా పునరుద్ధరించేలా చేస్తుంది. మా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము." అని అన్నారు. ఈ వారం ప్రారంభంలో, వోడాఫోన్ ఐడియా తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లన్నీ వొడాఫోన్ రెడ్ బ్రాండ్ కింద ప్రత్యేకంగా లభిస్తుందని ప్రకటించింది. కొత్త పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు నేరుగా వోడాఫోన్ రెడ్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios