గూగుల్‌ మ్యాప్స్‌ 15వ బర్త్ డే స్పెషల్...ఎంటో తెలుసా...?

సెర్చింజన్ ‘గూగుల్’ యాప్స్‌లో ముఖ్యమైంది గూగుల్ మ్యాప్స్. దీనికి సరిగ్గా గురువారం నాటికి 15 వసంతాలు నిండాయి. ఈ నేపథ్యంలో గూగుల్ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. తన మ్యాప్స్ యాప్‍ను న్యూ ఐకాన్, న్యూ లేఔట్, న్యూ ట్రాన్సిట్ ఇన్ఫర్మేషన్‌తో ఐదు నూతన ట్యాబ్స్‌ను ఆవిష్కరించింది.

Google Maps updated with new icon, new layout, and new transit information

న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌ తన యాప్‌లలో ప్రధాన యాప్‌ గూగుల్‌ మ్యాప్‌ను కొత్త లోగో, కొత్త ఫీచర్లతో ఆవిష్కరించింది. గూగుల్‌ మ్యాప్‌ 15వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం గూగుల్ ఈ కీలక మార్పులు చేసింది.గూగుల్ మ్యాప్స్ 15 ఏళ్లు మైలురాయిని అధిగమించిన సందర్భంగా కలర్‌ఫుల్‌ కొత్త లోగోను ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా యూజర్ల సౌలభ్యం కోసం తాజాగా ఐదు కొత్త వసతులను పరిచయం చేసింది. యాప్‌ అడుగుభాగంలో ఎక్స్‌ప్లోర్‌, కమ్యూట్‌, సేవ్డ్‌, కంట్రిబ్యూట్‌, అప్‌డేట్స్‌ (అన్వేషించండి, ప్రయాణించండి, సేవ్ చేయండి, సహకరించండి, నవీకరణ) అనే ఐదు ట్యాబ్స్‌ను కొత్తగా  జత కలిపింది. దీంతో ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్‌లో అంతర్గతంగా ఉన్న వసతులన్నీ ఈ ఐదు ట్యాబ్స్‌లో ఇక సులభంగా అందుబాటులోకి వస్తాయన్నమాట.

also read ‘వొడాఫోన్ ఐడియా’ పోస్ట్​పెయిడ్ సర్వీసు పేరు మార్పు...

కొత్త ట్యాబ్స్‌లో పేర్కొన్న అన్వేషణలో భాగంగా సమీప రెస్టారెంట్లు, ముఖ్య ప్రదేశాలు, సమీక్షలు, అలాగే సమీక్షలను వ్రాయడానికి, ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి, ఇతర సిఫార్సులను  అనుమతినిస్తుంది. ఒక ప్రదేశానికి దిశలను ఇస్తుంది, ప్రయాణ సమయ అంచనాలు, ట్రాఫిక్ హెచ్చరికలను ఎప్పటిలాగే అందిస్తుంది. సులభంగా సెర్చ్‌ చేసేందుకు వీలుగా ఇప్పటివరకు వినియోగదారులు సేవ్ చేసిన  హోం, ఆఫీస్‌, నచ్చిన రెస్టారెంట్లు, తదితర వివరాలు ఒకేచోట కనిపిస్తాయి.

Google Maps updated with new icon, new layout, and new transit information

అలాగే గతంలో ఎక్కడెక్కడ తిరిగారో అన్ని వివరాలు చూపించే టైం లైన్‌ ఆప్షన్ కూడా దీంట్లోనే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే లొకేషన్ హిస్టరీ డిజేబుల్ చేసుకోవచ్చు.ఎప్పటికప్పుడు వెళ్లే ప్రదేశాల ఫోటోలు, ఆయా రెస్టారెంట్లు ఇతర స్థలాల గురించి రివ్యూలను ప్రపంచంతో షేర్ చేసుకునే అవకాశం కంట్రిబ్యూషన్‌ ట్యాబ్‌తో గూగుల్ మ్యాప్ అందిస్తుంది. అలాగే ఇప్పటికే ఉన్న ప్రదేశాలకు సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కూడా సూచించవచ్చు. 

also read ఫేస్ బుక్ వల్ల మీ ఉద్యోగానికి ఎసరు...జాగ్రత్త...

ప్రస్తుతం మీరు ఉన్న ప్రదేశానికి దగ్గరలోని అన్ని ప్రదేశాలకు సంబంధించిన రికమండేషన్లు, స్థానిక నిపుణులు, వివిధ వ్యాపార సంస్థల మెసేజ్‌ల వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే బస్సు, ట్రైన్ ప్రయాణం గురించి ప్రయాణం ముగిసిన వెంటనే మరింత సమాచారం ఇచ్చే విధంగా గూగుల్ మ్యాప్స్ యూజర్లను ఇక మీదట ప్రోత్సహిస్తుంది. అలాగే ఆ సమాచారాన్ని వినియోగ దారులందరికీ అందుబాటులో ఉంచుతుంది. 

మీరు ఈ టాబ్ ద్వారా నేరుగా మ్యాప్స్‌లోని ఇతరులతోనూ, వ్యాపార లావాదేవీలు జరిపే వారితోనూ సంభాషించవచ్చు. వివిధ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇక మీదట అక్కడ ఉండే ఉష్ణోగ్రతలు, వీల్ ఛెయిర్ వంటి సదుపాయాలు లాంటి వివరాలు లభిస్తాయి. నిర్దిష్ట ప్రాంతాల్లో, మహిళల కోసం కొత్త భద్రతా సమాచారం కూడా ఉంది. ఇందులో  సురక్షితమైన రవాణా మార్గాల సమాచారాన్ని అందిస్తుంది. అక్కడ ఉండే సెక్యూరిటీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు వంటి వివరాలను కూడా గూగుల్ మ్యాప్స్ మనకు తెలియజేస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios