వోడాఫోన్ ఐడియా టెలికాం కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది, ఈ ప్లాన్ ప్రైమరీ వినియోగదారుకు ఆన్ లిమిటెడ్  హై-స్పీడ్ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ప్లస్ 699ఎఫ్ అని పిలువబడే ఈ కొత్త విఐ పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ రెండు కనెక్షన్లకు రూ.948 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ  ప్లాన్ లో ప్రతి కొత్త కనెక్షన్‌కు రూ.249 అదనంగా చెల్లించాలి. మొత్తం 5 కనెక్షన్లు ఈ ప్లాన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ ప్రస్తుతం 3 డిసెంబర్ 2020 నుండి ఉత్తర ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ప్లాన్ తో ప్రాధమిక కనెక్షన్‌కు  ఆన్ లిమిటెడ్ హై-స్పీడ్ డేటాను, రెండవ కనెక్షన్ కి 30జి‌బి, సెకండరీ కనెక్షన్ల కోసం 30జి‌బి డేటా రోల్‌ఓవర్‌ను కూడా ఇస్తుంది.

also read డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్ కు పెరుగుతున్న యూజర్లు.. భారత్‌ నుంచే అత్యధిక వినియోగదారులు.. ...

వాయిస్ కాలింగ్ ప్రయోజనాల పరంగా రూ.948 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ తో ఆన్ లిమిటెడ్ లోకల్, ఎస్‌టిడి, రోమింగ్ కాల్‌ చేసుకోవచ్చు. ప్రాధమిక, ద్వితీయ కనెక్షన్ల కోసం నెలకు 100 ఎస్‌ఎం‌ఎస్ అందిస్తుంది.

రూ. 948 పోస్ట్‌పెయిడ్ కుటుంబ ప్లాన్ ప్రాధమిక, ద్వితీయ కనెక్షన్‌లకు విఐ మూవీస్, టీవీ యాక్సెస్‌ను ఉచితంగా ఇస్తుంది. ప్రాధమిక కనెక్షన్‌ వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ప్రీమియం  సబ్ స్క్రిప్షన్ ఇస్తుంది.  

ఈ ప్లాన్ భవిష్యత్తులో ఇతర టెలికాం సర్కిల్‌లలో లభిస్తుందా లేదా అనేది స్పష్టంగా లేదు. ఈ నెల ప్రారంభంలో విఐ రూ. 1,348 రెడ్‌ఎక్స్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అలాగే రూ. 598, రూ. 749 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలి ప్లాన్ ధరను రూ. 649, రూ. 799గా  సవరించింది.