డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్ కు పెరుగుతున్న యూజర్లు.. భారత్ నుంచే అత్యధిక వినియోగదారులు..
హాట్‌స్టార్ లో సుమారు 2.6 కోట్ల మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లలు ఉన్నారని, గత నెలల్లో దాదాపు 75 లక్షల మంది కొత్త పేయిడ్ సబ్‌స్క్రైబర్లు చేరారు అని తెలిపింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సుమారు 1.85 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు డిస్నీ గత నెలలో వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 2 డిసెంబర్ 2020 నాటికి డిస్నీ ప్లస్ కి ఉన్న 8.68 కోట్ల సబ్‌స్క్రైబర్లలో హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు 30% చేరినట్లు డిస్నీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అండ్ డైరెక్ట్-టు-కన్స్యూమర్ విభాగం చైర్మన్ రెబెకా కాంప్బెల్ గురువారం కంపెనీ వార్షిక పెట్టుబడిదారుల దినోత్సవంలో తెలిపారు.
హాట్‌స్టార్ లో సుమారు 2.6 కోట్ల మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లలు ఉన్నారని, గత నెలల్లో దాదాపు 75 లక్షల మంది కొత్త పేయిడ్ సబ్‌స్క్రైబర్లు చేరారు అని తెలిపింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సుమారు 1.85 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు డిస్నీ గత నెలలో వెల్లడించింది. ఇందులో భారత్ వాటా కూడా ఉంది. సెప్టెంబర్ ఆరంభంలో ఇండోనేషియా, గత నెలలో సింగపూర్‌లోకి ప్రవేశించింది.
గత నెలతో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ టోర్నమెంట్ 13వ ఎడిషన్ నుండి ఈ వృద్ధి పెరిగింది. ఈ సర్వీస్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారతదేశంలో ప్రతి వినియోగదారుల నుండి సగటున రూ.2.19 ఆదాయాన్ని ఆర్జించిందని కంపెనీ గత నెలలో వెల్లడించింది.
also read భార్య కెరీర్ కోసం రూ.750 కోట్ల బోనస్‌ను వొదులుకున్న జలాండో సీఈఓ ...
"వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతితో, భారతదేశం మంచి మార్కెట్ అవకాశంగా ఉంది. స్టార్ టివి, హాట్‌స్టార్‌లతో మన ప్రస్తుత ఉనికి కారణంగా దేశంలో విజయవంతం కావడానికి మేము ప్రత్యేకంగా ఉన్నాము" అని రెబెకా కాంప్‌బెల్ తెలిపారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రస్తుతం ఏడు భారతీయ భాషలలో కంటెంట్‌ను అందిస్తోందని, ప్రతి సంవత్సరం 17వేల గంటల స్థానిక ప్రోగ్రామింగ్‌ను జతచేస్తుందని ఆమె అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ స్ట్రీమింగ్ సర్వీసులకు ప్రస్తుతం 13.7 కోట్లమంది పెయిడ్ సబ్‌స్క్రైబర్లున్నట్లు డిస్నీ సీఎఫ్‌వో క్రిస్టీన్ మెకార్థీ తెలియజేశారు. 2024కల్లా ఈ సంఖ్య 30-35 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.
భారతదేశంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఎంఎక్స్ ప్లేయర్, సోనీలైవ్, వూట్, ఆల్ట్ బాలాజీ వంటి వాటితో పోటీపడుతుంది.
భారతదేశం, ఇండోనేషియాలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ప్రపంచవ్యాప్తంగా డిస్నీ ప్లస్ విజయవంతం కావడంతో వినోద మార్కెట్‌ను బట్టి స్టార్, స్టార్ ప్లస్ అనే రెండు వేర్వేరు బ్రాండ్ల ద్వారా ఈ సేవను అందించనుంది.
లాటిన్ అమెరికాలో ఈ సర్వీస్ జూన్ 2021 నుండి స్టార్ ప్లస్ గా ప్రారంభించబడుతుంది. డిస్నీ స్టూడియోలు, లోకల్ ఒరిజినల్స్ నుండి వినోద కంటెంట్ కాకుండా సాకర్ లీగ్స్, గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఇతర వాటితో సహా ఈఎస్‌పిఎన్ నుండి లైవ్ స్పొర్ట్స్ కూడా అందిస్తుంది.