Asianet News TeluguAsianet News Telugu

హువావే చుట్టూ ఆంక్షల వల: టెక్నాలజీ నియంత్రణకు అమెరికా పాట్లు

5జీ రంగంలో అద్భుత విజయాలు సాధించిన హువావే సంస్థను నిలువరించడం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతున్నది. తాజాగా తమ దేశం నుంచి హువావేకు అవసరమైన సెమీ కండక్టర్లను తయారు చేసే సంస్థలు అందుకు లైసెన్సులు తీసుకోవాలని షరతు విధించింది.  

US Another Step To Protect National Security Integrity Of 5G Networks
Author
Hyderabad, First Published May 22, 2020, 11:13 AM IST

వాషింగ్టన్‌: చైనా టెలికం దిగ్గజం హువావే టెక్నాలజీస్‌ సంస్థను కట్టడి చేసేందుకు అమెరికా మరో ముందడుగు వేసింది. జాతీయ భద్రత, 5జీ నెట్‌వర్క్‌ సమగ్రత రక్షణ అంశం విషయమై వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసింది.  

అమెరికా పౌరుల గోప్యత, ప్రపంచ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తాము సహించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో హెచ్చరించారు. 

ఇక తాజా నిబంధనల నేపథ్యంలో అమెరికా టెక్నాలజీని హువావే దుర్వినియోగం చేసే వీలు లేకుండా పోయిందని అమెరికా తెలిపింది. తద్వారా తమ జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లబోదని పేర్కొంది.

అంతేగాక అమెరికా టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి హువావే కోసం సెమీ కండక్టర్లను తయారు చేసే దేశాలపై టెక్నాలజీ పరంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి తమ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్‌ చేసే వస్తువులను హువావేకు అమ్మాలనుకుంటే లైసెన్స్‌ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. 

జాతీయ భద్రత, అంతర్జాతీయ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు హువావేకు ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు అమెరికా వెల్లడించింది. ఇక హువావేను అమెరికా అవిశ్వసనీయ వ్యాపార సంస్థగా అభివర్ణించింది. 

also read హైదరాబాదిలకు గుడ్ న్యూస్ ​: ఉబర్ కనెక్ట్ పేరిట సరుకుల ‘డెలివరీ‘ ...

చైనా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆరోపణలు గుప్పించింది. అమెరికాలో హువావే గూఢచర్యం చేస్తోందని ఇప్పటికే దానిపై అమెరికా న్యాయశాఖ నేరారోపణలు చేసింది. అదే విధంగా ఇరాన్‌తో అనుమానాస్పద ఒప్పందాలు కుదర్చుకుని.. ఆ దేశానికి సహకరిస్తోందని ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో హువావే నమ్మదగిన వ్యాపార సంస్థ కాదని పేర్కొంటూ... ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్‌వర్క్‌ మౌలిక వసతులు గనుక హువావే వద్ద ఉన్నట్లయితే.. ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. కాబట్టి హువాపై ఆంక్షలు విధించాలని సూచించింది. 

కాగా మొబైల్‌ ఫోన్ల నెట్‌వర్క్‌లో నూతన విప్లవంగా భావిస్తున్న 5జీ నెట్‌వర్క్‌ టెక్నాలజీని అందించేందుకు హువావే వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హువావే టెక్నాలజీ కారణంగా దేశ భద్రత పరంగా ముప్పు కలిగించేలా ఉందంటూ హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో గతేడాది జూన్‌లో హువావే ఒప్పందం కుదుర్చుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios