న్యూఢిల్లీ: క్యాబ్‌‌‌‌‌‌‌‌ అగ్రిగేటింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఉబర్‌ కరోనా ‘లాక్ డౌన్’లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే దిశగా ముందుకు అడుగేసింది. హైదరాబాద్ నగరంలో ‘ఉబర్ కనెక్ట్’ పేరిట వస్తువుల డెలివరీ సేవలను ప్రారంభించింది.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ, నోయిడా, చెన్నై, చండీగఢ్‌‌‌‌‌‌‌‌లలో గురువారం నుంచి కనెక్ట్‌‌‌‌‌‌‌‌ పేరుతో ప్యాకేజీ సర్వీసులసు మొదలుపెట్టింది. కోల్‌‌‌‌‌‌‌‌కతా, జైపూర్‌‌‌‌‌‌‌‌, గువాహటి, గుర్గావ్‌‌‌‌‌‌‌‌లో ఇది వరకే ఇలాంటి సేవలను కంపెనీ షురూ చేసింది. నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి వస్తువులను రవాణా చేయడానికి కనెక్ట్‌‌‌‌‌‌‌‌ సర్వీసు ఉపయోగపడుతుంది.

భౌతిక దూరం (సోషల్‌‌‌‌‌‌‌‌ డిస్టెన్సింగ్‌‌‌‌‌‌) నిబంధనలను ‌‌‌పాటిస్తూ వస్తువులను డెలివరీ చేస్తున్నామని ఉబర్ కంపెనీ తెలిపింది. గతవారం నుంచి ప్రారంభించిన కనెక్ట్‌‌‌‌‌‌‌‌కు మంచి స్పందన వస్తోందని ఉబర్‌‌‌‌‌‌‌‌ ఇండియా సీనియర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ ప్రభుజీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఉబర్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ, నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ ద్వారా సమర్థంగా సేవలు అందించగలుగుతున్నామని వివరించారు.

also read ఒకే వేదికపై 200 సింగర్స్ తో పాట..పి‌ఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం... ...

ఐదు కిలోల కంటే తక్కువ బరువు ఉన్న ప్యాకేజీలను టూవీలర్‌‌‌‌‌‌‌‌ ద్వారా డెలివరీ చేస్తారు. కనెక్ట్‌‌‌‌‌‌‌‌ సేవలు అందించే సిబ్బందికి గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌పై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఇప్పించామని ఉబర్ వెల్లడించింది. కస్టమర్‌‌‌‌‌‌‌‌ తన వస్తువును పంపించాక, ఉబర్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా దానిని ట్రాక్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. డెలివరీ స్టేటస్‌‌‌‌‌‌‌‌ను షేర్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు.

అన్ని చోట్లా క్యాబ్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రయాణికులను చేర్చడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనూ ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ సర్వీసులను తిరిగి అందిస్తున్నామని ఉబర్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. ఫేస్ మాస్క్ పెట్టుకున్న వారినే క్యాబ్‌‌‌‌‌‌‌‌లోకి అనుమతిస్తున్నామని, డ్రైవర్లకు కూడా మాస్క్‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ సెల్ఫీని తప్పనిసరి చేశామని పేర్కొంది.

డ్రైవర్‌‌‌‌‌‌‌‌తోపాటు ప్యాసింజర్లు ప్రయాణానికి ముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలని ఉబర్ తెలిపింది. డ్రైవర్‌‌‌‌‌‌‌‌ పక్కన కాకుండా కారు వెనక సీట్లో మాత్రమే కూర్చోవాలి. హెల్త్‌‌‌‌‌‌‌‌టిప్స్‌‌‌‌‌‌‌‌ను కూడా ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌, ఈ–మెయిల్‌‌‌‌‌‌‌‌ ద్వారా పంపిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్​ ఒకరు వివరించారు.