సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టింగ్స్..200 అకౌంట్స్‌ను డిలీట్ చేసిన ఫేస్‌బుక్
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం వల్ల జరుగుతున్న నిరసనలకు మరింత ప్రేరేపించేలా ప్రయత్నిస్తున్న వారి పోస్టులను అధికారులు తొలగించారు.ఈ అకౌంట్లు శ్వేత జాతీయుల గ్రూపులకు అనుసంధానించి ఉన్నాయని పేర్కొంటూ దాదాపు 200 సోషల్ మీడియా ఖాతాలను ఫేస్‌బుక్ తొలగించింది.
అమెరికాలో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి నల్లజాతీయుడిపై పోలీసుల హత్యకు నిరసన తెలిపేందుకు హాజరుకావాలని ప్రజల్లో విద్వేశాలను రెచ్చగొట్టి ప్రేరేపించేలా ఉన్న 200 ఫేస్‌బుక్ అకౌంట్స్‌ను డిలిట్ చేసినట్లు ఫేస్‌బుక్ సంస్థ తెలిపింది.
ఈ అకౌంట్లు శ్వేత జాతీయుల గ్రూపులకు అనుసంధానించి ఉన్నాయని పేర్కొంటూ దాదాపు 200 సోషల్ మీడియా ఖాతాలను ఫేస్‌బుక్ తొలగించింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఖాతాలకు ప్రౌడ్ బాయ్స్, అమెరికన్ గార్డ్ గ్రూపులకు అనుసంధానించి ఉన్నాయని తెలిపింది, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఇప్పటికే అమెరికన్ గార్డ్ గ్రూపును నిషేధించినట్లు తెలిపింది.
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం వల్ల జరుగుతున్న నిరసనలకు మరింత ప్రేరేపించేలా ప్రయత్నిస్తున్న వారి పోస్టులను అధికారులు తొలగించారు.
also read ఫ్లిప్‌కార్ట్‌లో సామ్‌సంగ్ డేస్ సేల్.. స్మార్ట్ ఫోన్స్ పై ఆఫర్లే ఆఫర్లు... ...
"ఈ గ్రూపుల మద్దతుదారులను, గ్రూపు సభ్యులు రెచ్చగొట్టి నిరసనలో పాల్గొనేల ప్రణాళికలు వేస్తున్నారని" అని ఫేస్‌బుక్ ఒక డైరెక్టర్ బ్రియాన్ ఫిష్మాన్ అన్నారు. నిరసనల కోసం వారి ప్రణాళికలు, వారు యు.ఎస్ లో ఎక్కడ నివసిస్తున్నారు వంటి ఖాతాదారుల వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
ప్రౌడ్ బాయ్స్, అమెరికన్ గార్డ్ అనే రెండు గ్రూపులలో నిబంధనలను ఉల్లంఘించినంచి ద్వేషపూరిత సంభాషణ, పోస్టుల కరణంగా ఫేస్‌బుక్ నుండి వాటిని నిషేధించింది. ఈ నిషేధాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారుల కొత్త పేజీలు, గ్రూపులు లేదా ఖాతాలను తొలగించడం కొనసాగిస్తామని కూడా ఫేస్‌బుక్ తెలిపింది.
ఆఫ్రికా, ఇరాక్ దేశ ప్రజల అభిప్రాయాలను తప్పుదోవ పట్టించడానికి చేసిన నకిలీ ఖాతాల నెట్వర్క్లను తొలగించనున్నట్లు ఫేస్‌బుక్ శుక్రవారం ప్రకటించింది.
ఫేస్‌బుక్ నకిలీ ఖాతాలు, పేజీల నెట్‌వర్క్‌ను అట్లాంటిక్ కౌన్సిల్ డిజిటల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ ల్యాబ్ కనుగొంది. తమ నివేదికలో, డిఎఫ్‌ఆర్‌ఎల్ పరిశోధకులు తప్పుడు సమాచారం, ఆన్‌లైన్ మానిప్యులేషన్‌లో ఎక్కువ పిఆర్ సంస్థలు పనిచేస్తున్నట్లు తాము గమనించామని చెప్పారు.