భారతదేశంలో టిక్‌టాక్ నిషేధం వల్ల ఏర్పడిన అంతరాయన్ని పూరించడానికి ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ "షార్ట్స్" అనే కొత్త వీడియో షేరింగ్ యాప్ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని యూట్యూబ్ సంస్థ భారతదేశంలో టిక్‌టాక్ కు పోటీగా బీటా వెర్షన్‌ లో "షార్ట్స్" యాప్ ను  ప్రకటించింది.

యూట్యూబ్ షార్ట్ వీడియోలు 15 సెకన్ల నిడివిలో షార్ట్ వీడియోలు షూట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. చైన యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్ లాగానే యూట్యూబ్ "షార్ట్స్" యాప్ ఉంటుంది. "మేము యూట్యూబ్ షార్ట్‌ యాప్ ను ప్రపంచ వినియోగదారులు, వీడియో  క్రియేటర్లను మీ ముందుకు తీసుకురావడానికి దీన్ని విడుదల చేస్తున్నాము" అని యూట్యూబ్ తెలిపింది.

also read  ఒరాకిల్‌తో టిక్ టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ జట్టు.. మైక్రోసాఫ్ట్‌ అవుట్‌.. ...

ఫీచర్లు, కొత్త ఫార్మాట్‌ కోరుకునే వినియోగదారుల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా  మరిన్ని ఫీచర్లు జోడిస్తామని, రాబోయే నెలల్లో మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్లు తెలిపింది. యూట్యూబ్ ప్రకారం ప్రతి నెలా 2 బిలియన్ మంది యూట్యూబ్‌ను చూస్తున్నారు.

 "తరువాతి జనరేషన్ మొబైల్ వీడియో క్రియేటర్లు షార్ట్‌ యాప్ తో ఒక సంఘంలాగా ఏర్పడి ఎదగాలని మేము కోరుకుంటున్నాము. మల్టీ వీడియో క్లిప్‌లను స్ట్రింగ్ చేయడానికి మల్టీ-సెగ్మెంట్ కెమెరా, స్పీడ్ కంట్రోల్స్,  హ్యాండ్స్-ఫ్రీ రికార్డ్ చేయడానికి టైమర్, కౌంట్‌డౌన్ ఫీచర్లు కూడా ఉన్నాయి "అని బ్లాగ్‌పోస్ట్ తెలిపింది.

ప్రస్తుతం యూట్యూబ్ షార్ట్‌ యాప్  ఆండ్రయిడ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో  ఐ‌ఓ‌ఎస్ వినియోగదారుల కోసం కూడా లాంచ్ చేయనుంది. భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడంతో జూన్‌లో టిక్‌టాక్ తో సహ 58 ఇతర చైనా యాప్స్ లను భారతదేశం నిషేధించింది. జూలైలో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇదే ఫార్మాట్ లో రీల్స్ వెర్షన్‌ను విడుదల చేసింది.