వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్: చైనాకు చెందిన టిక్‌టాక్ వీడియో యాప్‌ను జాతీయ భద్రతకు  ప్రమాదంగా గుర్తించిన తరువాత టెక్ దిగ్గజం ఒరాకిల్ టెక్నాలజీ టిక్‌టాక్   అమెరికన్ భాగస్వామిగా ఎంచుకుంది.

మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన ప్రతిపాదనను టిక్ టాక్  మాతృ సంస్థ బైట్‌డాన్స్ తిరస్కరించినట్లు  టిక్‌టాక్ యుఎస్ కార్యకలాపాలకు సంబంధించి ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్ సోమవారం దీనిని  ధృవీకరించారు.

టిక్ టాక్  ఒక ప్రకటనలో "మేము ట్రెజరీ విభాగానికి ఒక ప్రతిపాదనను రూపొందించి సమర్పించాము, ఇది దేశ భద్రతా సమస్యలను పరిష్కరిస్తుందని, టిక్‌టాక్‌ యూజర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము" అని తెలిపింది.  

యుఎస్ లో సుమారు 100 మిలియన్ల మంది ప్రజలు టిక్‌టాక్ యాప్ ఉపయోగిస్తున్నారు. కానీ ఈ ఒప్పందం గురించి కీలకమైన వివరాలు స్పష్టత లేదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి.

"వారాంతంలో ఒరాకిల్‌ నుంచి టెక్నాలజీ భాగస్వామిగా చేర్చుకునే ప్రతిపాదన మాకు వచ్చింది" అని మునుచిన్ సిఎన్‌బిసిలో చెప్పారు, జాతీయ భద్రతా సమస్యల కోసం విదేశీ లావాదేవీలను సమీక్షించే ప్రభుత్వ ప్యానెల్ ఈ బిడ్‌ను నిర్వహిస్తుందని అన్నారు.

"అమెరికన్ యూసర్ల  డేటా భద్రత, ఫోన్లు సేఫ్టీపై  రాబోయే కొద్ది రోజుల్లో మా సాంకేతిక బృందాలతో ఒరాకిల్‌తో చర్చలు జరుపుతాము" అని మునుచిన్ చెప్పారు.

also read అమెజాన్‌లో లక్ష ఉద్యోగాలు.. గంటకు 15 డాలర్లు, అదనంగా 100 డాలర్ల బోనస్‌ కూడా ...

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 20 లోగా చైనా కంపెనీ యుఎస్ కార్యకలాపాలను ఏదైనా పెద్ద సంస్థకు విక్రయించాలని లేదంటే నిషేధం తప్పదని ఆదేశించారు.

చైనా స్టేట్ మీడియా సంస్థలు సిజిటిఎన్, చైనా న్యూస్ సర్వీస్ సోమవారం టిక్‌టాక్‌ను ఒరాకిల్‌కు విక్రయించవచ్చని  నివేదించగా, ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ లావాదేవీని భాగస్వామ్యంగా నిర్మిస్తున్నదని, బహుశా  విక్రయ డీల్‌గా ఉండకపోవచ్చని  తెలిపింది.

షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్  యునైటెడ్ స్టేట్స్ లో ఎంతో  జనాదరణ పొందింది. గత నెలలో, చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను ప్రచురించింది, బైట్‌డాన్స్ కొత్త నిబంధనలను "ఖచ్చితంగా పాటిస్తామని" ప్రతిజ్ఞ చేసింది.

టిక్‌టాక్ యుఎస్ కార్యకలాపాలను సంపాదించడానికి ఆసక్తి ఉందని మైక్రోసాఫ్ట్ ఆగస్టు ప్రారంభంలో సూచించింది, కాని మైక్రోసాఫ్ట్ బిడ్ తిరస్కరించినాట్లు  ఆదివారం టిక్‌టాక్  ప్రకటించింది.

టిక్‌టాక్ కోసం లావాదేవీలు ఒరాకిల్ క్రెడిట్ రేటింగ్‌ను దిగజార్చవచ్చని ఎస్ అండ్ పి సోమవారం హెచ్చరించింది. ఒరాకిల్ షేర్లు 4.3 శాతం పెరిగి 59.46 డాలర్ల వద్ద ముగిశాయి.