‘చింగారి’ చిందులు: చైనా ‘టిక్ టాక్’కు గట్టి చాలెంజ్
చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ ‘చింగారి’ రికార్డులు సృష్టిస్తున్నది. కేవలం 72 గంటల్లో ఐదు లక్షల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన డెవలపర్లు దీన్ని తయారు చేయగా ‘మేడిన్ ఇండియా’ సెంటిమెంట్ దీనికి బాగా కలిసొస్తున్నది. ప్రస్తుతం డౌన్‌లోడ్ల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నదని, గూగుల్ ప్లే స్టోర్‌లో చింగారి ఒకటో స్థానంలో ఉందని డెవలపర్లు చెప్పారు.
న్యూఢిల్లీ: టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిట్రాన్ యాప్ ఎన్నో రోజులు నిలబడలేదు. డౌన్‌లోడ్లతో దూసుకుపోతున్న ఆ యాప్‌ను గతంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇండియన్ యాప్ టిక్‌టాక్‌కు పోటీగా దిగింది. ప్రస్తుతం ‘చింగారి’ యాప్ మార్కెట్లో సెన్సేషన్‌గా మారింది.
పైగా గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనిక బలగాల మధ్య ఘర్షణ నేపథ్యంలో ‘బాయ్‌కాట్ చైనా ప్రొడక్ట్స్’ నినాదం తర్వాత ఈ యాప్‌కు మరింత ప్రాచుర్యం లభించింది. గడిచిన మూడు రోజుల్లోనే దీన్ని ఐదు లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో "చింగారి" ట్రెండింగ్‌లో నిలిచింది.
చింగారి సహ వ్యవస్థాపకుడు బిశ్వాత్మ నాయక్ మాట్లాడుతూ... "భారతీయులు ఇప్పుడు టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. అయితే మేం అందరి అంచనాలకు మించి దీన్ని రూపొందించాం. ఈ యాప్‌ను వాడుతున్న వినియోగదారులు సంతోషం వ్యక్తం చేయడం సంతృప్తినిస్తోంది’ అని తెలిపారు.
also read మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50 లక్షల మందికి అవకాశం..
కాగా ఈ ఆడియో వీడియో ప్లాట్‌ఫామ్‌ను 2019లోనే డెవలప్ చేశారు. ఇందులో కొత్త వ్యక్తులతో చాట్ చేయవచ్చు, వీడియోలు అప్‌లోడ్ చేయవచ్చు. వినియోగదారులే స్వంతంగా వాట్సాప్ స్టేటస్‌లు, వీడియోలు, ఆడియోలు కూడా రూపొందించవచ్చు.
ఈ యాప్‌లో ఎవరి వీడియోలు వైరల్ అవుతాయో వారికి పాయింట్లు లభిస్తాయి. దీన్ని డబ్బులుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ యాప్ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మరాఠి, బంగ్లా, పంజాబీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
అతి తక్కువ సమయంలో భారీ డమాండ్ రావడం పట్ల దాని డెవలపర్లు చాలా సంతోషంగా ఉన్నారు. తమ అంచనాలకు మించి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారని వ్యవస్థాపకుడు బిస్వాత్మ నాయక్ పేర్కొన్నారు. వినియోగదారుల ఆకాంక్షాలకు అనుగుణంగా తాము పని చేస్తామన్నారు. టిక్ టాక్ యాప్‌కు పోటీగా తీసుకొచ్చిన మిత్రాన్ యాప్ తేలిపోయింది.