Asianet News TeluguAsianet News Telugu

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50 లక్షల మందికి అవకాశం..

కరోనా ప్రభావం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కానీ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఐటీ సంస్థలపై సంబంధిత క్లయింట్లు ఒత్తిడి తెస్తున్నారు. కరోనా విధించిన ‘లాక్‌డౌన్’తో ఉద్యోగులంతా సొంత రాష్ట్రాలకు వెళ్లారు. మహిళా ఉద్యోగులు స్థానికంగా ఉండిపోవడం వారికి కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలతోపాటు ఎలక్ట్రానిక్, మొబైల్స్ తదితర సంస్థలు కూడా అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో మహిళలనే ఉద్యోగులుగా నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

IT Companies are prioritise would be to give jobs for womens
Author
Hyderabad, First Published Jun 22, 2020, 2:37 PM IST

ముంబై: కరోనా మహమ్మారి దెబ్బతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. అయితే మహిళలకు కరోనా సంక్షోభం వరంగా మారనుంది. కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. మహిళలు మాత్రం తమ కుటుంబ సభ్యుల సెంటిమెంట్‌తో స్థానికంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తారు. 

గతంలో తమకు అప్పగించిన ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఐటీ ఉద్యోగులు గతంలో ఒకే షిఫ్ట్‌లో పని చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయాలని లక్ష్యంతో కంపెనీ యాజమాన్యాలపై  క్లయింట్లు ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగులకే ప్రాధాన్యం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.

అదేవిధంగా ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌, తదితర రంగాలలో ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ విభాగం ఉద్యోగాలను ఆయా సంస్థలు మహిళలకు ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయి. కాగా అధిక స్థాయిలో మహిళా ఉద్యోగులను నియమించుకుంటామని క్వెస్‌ క్వార్ప్‌ సంస్థ ప్రెసిడెంట్‌ లోహిత్‌ భాటియా తెలిపారు.

also read  అంతా అబద్దం.. ‘చైనా యాప్స్‌ బ్యాన్’పై కేంద్రం క్లారిటి.. 

ప్రస్తుతం కంపెనీలు ఉద్యోగుల వలసలతో తీవ్రంగా నష్టపోయావని, మున్ముందు 50 లక్షల మంది మహిళా ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందని అవసర్‌ హెచ్ఆర్‌‌ సర్వీసెస్‌ ఉన్నతాధికారి నవనీత్‌ సింగ్‌ తెలిపారు. కాగా తమిళనాడులో‌ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 5,000 మంది మహిళ ఉద్యోగులను కంపెనీలు నియమించుకోనున్నాయి. 

కాగా దుస్తులను తయారు చేస్తున్న సంస్థలు 80% మహిళా ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ప్రకటించాయి. అయితే తాము వంద శాతం మహిళ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు గుర్గావ్‌కు చెందిన మాట్రిక్స్ సంస్థ ఎండీ గౌతమ్‌ నేర్‌ తెలిపారు. మహిళ ఉద్యోగులు నిబద్దత, వినయం, సహనం అధికంగా ఉంటాయని కొన్ని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా భవిష్యత్‌లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాలలో మహిళల ప్రాధాన్యం మరింత పెరగవచ్చని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios