టిక్‌టాక్ సిఈఓ రాజీనామా.. అసలు కారణం అదేనా.. ?
ఇచ్చిన గడువులోగా టిక్‌టాక్ కార్యకలాపాలను విక్రయించాలని లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. తాజాగా టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్ సంస్థ నుండి వైదొలిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
షార్ట్ వీడియో చైనా యాప్ టిక్‌టాక్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను ఏదైనా పెద్ద సంస్థకు విక్రయించాలని గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ పై ఒత్తిడి చేస్తున్నారు.
ఇచ్చిన గడువులోగా టిక్‌టాక్ కార్యకలాపాలను విక్రయించాలని లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. తాజాగా టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్ సంస్థ నుండి వైదొలిగినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికాలో టిక్‌టాక్ లావాదేవీలను నిషేదిస్తూ, టిక్‌టాక్ కార్యకలపాలను అమెరికాలోని ఏదైనా సంస్థకు గడువులోగా అమ్మేయాలని డెడ్ లైన్ విధించిన కొద్ది రోజుల తరువాత టిక్‌టాక్ చీఫ్ కెవిన్ మేయర్ రాజీనామా చేశారు.
also read గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో కొత్త ఫీచర్లు.. 10శాతం వేగంగా లోడ్ అవుతాయి.. ...
టిక్‌టాక్ సీఈఓ సిబ్బందికి రాసిన లేఖలో "నేను సంస్థ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాట్లు మీ అందరికీ తెలియజేస్తున్నాను." అని అన్నారు. టిక్‌టాక్ జనరల్ మేనేజర్ వెనెస్సా పప్పాస్ ను కెవిన్ మేయర్ స్థానంలో తాత్కాలికంగా నియమించారు.
అతను నేరుగా సంస్థ వ్యవస్థాపకుడు, సిఈఓ యిమింగ్ జాంగ్‌కు నివేదిస్తాడు. టిక్‌టాక్ వెబ్‌సైట్ ప్రకారం కెవిన్ మేయర్ డిస్నీలో సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్ తరువాత టిక్‌టాక్‌లో చేరారు. డిస్నీలో ఆయన ముఖ్యమైన పాత్రలో కొనసాగుతు సేవలందించారు, అతను సంస్థ ప్రధాన స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ+ అభివృద్ధిపై పర్యవేక్షించాడు.
బైట్‌డాన్స్ చెందిన టిక్‌టాక్ యాప్ అమెరికా దేశ జాతీయ భద్రతా ముప్పు అని భావించారు. అంతకుముందు ఇండియాలో కూడా టిక్‌టాక్ తో సహ మరో 58 యాప్స్ పై భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. టిక్‌టాక్ సిఈఓ రాజీనామాకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.